Begin typing your search above and press return to search.

డాడీ డ్రీమ్ ని అలా నెర‌వేరుస్తోన్న ఐటం భామ‌!

ఇందులో ఊర్వ‌శీ రౌతేలా ఓ కీల‌క పాత్ర పోషిస్తుంది. ఆమె పాత్ర ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుంది

By:  Tupaki Desk   |   16 March 2024 1:30 PM GMT
డాడీ డ్రీమ్ ని అలా నెర‌వేరుస్తోన్న ఐటం భామ‌!
X

వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా తెర‌కెక్కిన సినిమాలు ప్రేక్ష‌కుల్లోకి బ‌లంగా వేళ్తాయి. క‌ల్పిత క‌థ‌ల‌కంటే వాస్త‌వ క‌థ‌ల‌కు ఉన్న బ‌ల‌మ‌దే. ఇటీవ‌ల రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం `ఆర్టిక‌ల్ 370` ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. జమ్ముకశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 ర‌ద్దు చేసే అంశాన్ని ప్రధానంగా తీసుకుని తెర‌కెక్కించిన సినిమాకి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. తాజాగా ఇదే కోవ‌లో `జెఎన్ యూ : జ‌హంగీర్ నేష‌న‌ల్ యూనివ‌ర్శిటీ` చిత్రాన్ని విన‌య్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్నారు.


ఇందులో ఊర్వ‌శీ రౌతేలా ఓ కీల‌క పాత్ర పోషిస్తుంది. ఆమె పాత్ర ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుంది. జెఎన్ యూ స్టూడెంట్ పాత్ర లో క‌నిపించ‌నుంది. కాలేజీ రాజ‌కీయాలు..స‌వాళ్లు ఎదుర్కునే రోల్ అది. విద్యా సంస్థ‌ల పేరు తో దేశ స‌మైక్య‌త‌కు కొన్ని వ‌ర్గాలు ఎలాంటి విఘాతం క‌లిగిస్తున్నాయి? వాటి కార‌ణంగా విద్యార్ధుల జీవితాలు ఎలాంటి మ‌లుపుకు గుర‌వుతున్నాయి? వంటి అంశాలు చ‌ర్చిస్తున్నారు. అయితే ఈ పాత్ర‌తో త‌న తండ్రి కోరిక‌ను తీర్చిన‌ట్లుగానూ భావిస్తోంది ఊర్వ‌శీ రౌతేలా.

ఆమె స్కూల్ చుదువుతున్న రోజుల్లోనే త‌న తండ్రి స్కూల్ జెఎన్ యూ యూనివ‌ర్శిటీలో చ‌ద‌వాల‌న్న‌ది కోరిక అట‌. కానీ నిజ జీవితంలో తండ్రి కోరిక‌ను ఊర్వ‌శి నిజం చేయ‌లేక‌పోయినా ఇప్పుడు సినిమా రూపంలో తీర్చుతున్నంద‌కు సంతోషం వ్య‌క్తం చేసింది. ఇలాంటి పాత్ర‌ల్లో న‌టిస్తున్న‌ప్పుడు తెలియ కుండా ఏదో తెలియ‌ని శ‌క్తి తోడ‌వుతుంద‌ని... ఇలాంటి సినిమాలు మ‌న‌సుకు తృప్తిని క‌లిగిస్తాయ‌ని తెలిపింది.

ఊర్వ‌శి రౌతేలా అంటే ఐటం గాళ్ గా ఎంత పేమ‌స్ అన్న‌ది చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఇప్ప‌టికే స్టార్ హీరోల చిత్రాల్లో ఐటం పాట‌ల్లో న‌టించింది. వాల్తేరు వీర‌య్య‌..ఏజెంట్..బ్రో..స్కంద‌లో అమ్మ‌డు అంద చందాల‌తో చిచ్చ‌ర పిడుగులా చెల‌రేగిన వైనం తెలిసిందే. ప్ర‌స్తుతం న‌ట‌సింహ బాల‌కృష్ణ 109వ చిత్రంలోనూ మెప్పించ‌బోతుంది. అలాగే బ్లాక్ రోజ్ అనే మరో చిత్రంలోనూ న‌టిస్తోంది.