Begin typing your search above and press return to search.

సుగ‌ర్ డాడీతో ఊర్వ‌శి డేటింగ్?

ఈవెంట్ ఏదైనా షో స్టాప‌ర్‌గా నిల‌వ‌డం ఎలానో ఊర్వ‌శి రౌతేలాకు తెలుసు. కొన్నిసార్లు వివాదాలతో లేదా ఏదో ఒక ర‌కంగా ఊర్వ‌శి పేరు మీడియాలో పెద్ద ఎత్తున‌ చ‌ర్చ‌ల్లోకొచ్చింది.

By:  Tupaki Desk   |   14 July 2025 10:51 PM IST
సుగ‌ర్ డాడీతో ఊర్వ‌శి డేటింగ్?
X

ఈవెంట్ ఏదైనా షో స్టాప‌ర్‌గా నిల‌వ‌డం ఎలానో ఊర్వ‌శి రౌతేలాకు తెలుసు. కొన్నిసార్లు వివాదాలతో లేదా ఏదో ఒక ర‌కంగా ఊర్వ‌శి పేరు మీడియాలో పెద్ద ఎత్తున‌ చ‌ర్చ‌ల్లోకొచ్చింది. ఇంత‌కుముందు క్రికెట‌ర్ రిష‌బ్ పంథ్‌తో వివాదం కార‌ణంగా ఊర్వ‌శి పేరు మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చింది.

ఇప్పుడు అందుకు భిన్నంగా వింబుల్డ‌న్ 2025 మ్యాచ్ వీక్షించేందుకు లండ‌న్ వెళ్లిన ఊర్వ‌శి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఈసారి ఒక క్రీడాకారుడితో ఊర్వశి డేట్ చేస్తోందంటూ ప్ర‌చారం సాగిపోతోంది. అంతేకాదు.. ఊర్వ‌శి ల‌వ‌ర్ ఇలా ఉంటాడు అంటూ ఒక ఫోటో కూడా వైర‌ల్ అయిపోతోంది. అయితే దీనిని ఊర్వ‌శి కానీ, ఇత‌రులు కానీ క‌న్ఫామ్ చేయ‌లేదు. 30 ప్ల‌స్ ఏజ్‌లో ఊర్వ‌శి డేటింగ్ లైఫ్‌పై చాలా గుస‌గుస‌లు వినిపించాయి. కానీ ఇప్పుడు వింబుల్డ‌న్ ఫైన‌ల్ మ్యాచ్ వీక్షించేందుకు త‌న ల‌వ‌ర్ తో క‌లిసి రెక్క‌లు క‌ట్టుకుని వాలిపోయి ఉండొచ్చ‌ని కూడా ఊహాగానాలు సాగుతున్నాయి. ప్ర‌స్తుతం జత‌గాడితో క‌నిపించిన ఓ ఫోటోని కూడా బ్ల‌ర్ చేసి వైర‌ల్ చేస్తుండ‌డం క్యూరియాసిటీని పెంచింది. అయితే కొంద‌రు నెటిజ‌నులు మాత్రం బాగా ధ‌న‌వంతుడైన సుగ‌ర్ డాడీతో ఊర్వ‌శి డేట్ చేస్తోంద‌ని, డ‌బ్బు కోస‌మే అలా చేసే అవ‌కాశం ఉంద‌ని ఊహిస్తున్నారు.

అలాగే ఉర్వశి రౌతేలా వింబుల్డన్ లుక్ ఇంట‌ర్నెట్‌లో చాలా ట్రోలింగ్ కి గుర‌వుతోంది. ఈవెంట్‌లో `నకిలీ లాబుబస్` ధరించినందుకు నెటిజనులు ఊర్వ‌శిని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. చీప్ క్వాలిటీ బ్యాగ్ ధ‌రించింది అంటూ విమ‌ర్శిస్తున్నారు. లబుబు అనే `కొంటె బొమ్మ` ఈ సంవత్సరం డిజైనర్ బ్యాగులతో పాటు ఇష్టమైన యాక్సెసరీగా మారింది. అనన్య పాండే, లిసా, రిహన్న సహా చాలా మంది ప్రముఖులు వెయ్యి డాలర్ల ఖ‌రీదైన ఈ బ్రాండెడ్ హ్యాండ్‌బ్యాగ్‌లతో ల‌బుబూని జోడించ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.