టాలీవుడ్‌పై చాలా ఆశలు పెట్టుకుంది..!
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాను టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌ను అని, తనకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి అధికంగా ఆఫర్లు వస్తున్నాయని చెప్పుకొచ్చింది.
By: Tupaki Desk | 24 April 2025 12:45 PM ISTమెగాస్టార్ చిరంజీవితో 'వాల్తేరు వీరయ్య' సినిమాలో బాస్ పార్టీ, బాలకృష్ణతో 'డాకు మహారాజ్' సినిమాలో దబిడి దిబిడి సాంగ్ చేయడం ద్వారా టాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ ఐటెం సాంగ్ హీరోయిన్‌గా ఊర్వశి రౌతేలా నిలిచింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్ అనగానే ఈ అమ్మడి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఊర్వశి రౌతేలా మాస్ ఐటెం సాంగ్స్‌కి మంచి స్పందన వచ్చింది. ఇప్పటి వరకు తెలుగులో ఈమె చేసిన దాదాపు అన్ని సాంగ్స్ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయి. పైగా హీరోయిన్స్ రేంజ్‌లో ఈమె పారితోషికంను అందుకోవడం కూడా కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.
పారితోషికం భారీగా దక్కుతున్న నేపథ్యంలో టాలీవుడ్‌లో ఐటెం సాంగ్స్ చేసేందుకు ఈమె చాలా ఆసక్తిగా ఉంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాను టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌ను అని, తనకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి అధికంగా ఆఫర్లు వస్తున్నాయని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో తాను బిజీ స్టార్ అన్నట్లుగా జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గొప్ప తాను తెగ చెప్పుకుంది. చాలా మంది దర్శకులు నన్ను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి సినిమాల్లో నన్ను నటింపజేసేందుకు పోటీ పడుతున్నారంటూ కాస్త అతిగా వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఊర్వశి రౌతేలా చేసిన ఈ వ్యాఖ్యల గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
డాకు మహారాజ్ తర్వాత ఊర్వశి కొత్త సినిమాలతో వచ్చిందే లేదు. బ్లాక్ రోజ్ అనే సినిమాలో నటిస్తుంది. కానీ అది ఎప్పటికీ వస్తుంది అనే విషయమై క్లారిటీ లేదు. అయినా కూడా ఈ అమ్మడు టాలీవుడ్‌లో తనకు వచ్చే అవకాశాల గురించి, ముందు ముందు చేయబోతున్న సినిమాల గురించి చాలానే ఆశలు పెట్టుకుని ఉంది. హిందీలో ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నప్పటికీ టాలీవుడ్ పైనే ఈమెకి మోజు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్‌గా పేరు దక్కించుకున్న ఈ అమ్మడు హీరోయిన్‌గానూ ఆఫర్లు వస్తాయేమో అనే నమ్మకంతో కనిపిస్తుంది. ముందు ముందు ఈ అమ్మడి జోరు ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.
2013లో సింగ్ సాబ్ ది గ్రేట్ అనే సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టిన ఈ అమ్మడు దశాబ్ద కాలంలోనే అత్యధిక సినిమాల్లో నటించి మెప్పించింది. పలు సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్, ప్రత్యేక సాంగ్స్ చేయడం ద్వారా కూడా మరింతగా పాపులారిటీని సొంతం చేసుకుంది. తమిళ్‌లో ఈమె ది లెజెండ్ అనే సినిమాలో ముఖ్య పాత్రలో నటించింది. ఆ తర్వాత తమిళ్ నుంచి ఆఫర్లు వచ్చినా కొన్ని కారణాల వల్ల తిరస్కరించినట్లు సమాచారం అందుతోంది. మొత్తానికి ఊర్వశి రౌతేలా హిందీ, తమిళ్, తెలుగు, బెంగాలీ భాషల్లోనూ నటించడం ద్వారా పాపులారిటీ సొంతం చేసుకుంది. కానీ ప్రస్తుతం ఈమెకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో తెలుగు సినిమాలను ఎక్కువ చేయాలని ఆశ పడుతోంది.
