'సౌత్ లో గుడి కట్టాలి'.. దబిడి దిబిడి బ్యూటీ వింత కోరిక!
తాజాగా ఊర్వశి ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ సమయంలో తన పేరుతో ఉత్తరాఖండ్‌లో ఒక గుడి ఉందని తెలిపింది అమ్మడు.
By: Tupaki Desk | 18 April 2025 11:24 AM ISTబాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుందన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో పోస్టులతో, ఇంటర్వ్యూల్లో కామెంట్స్ తో ట్రెండింగ్ లో ఉంటుంది అమ్మడు. ఇప్పుడు మరోసారి తన వ్యాఖ్యలతో నెట్టింట హాట్ టాపిక్ గా నిలిచింది. అసలేం జరిగింది.. ఊర్వశి రౌతేలా ఏమందంటే..
తాజాగా ఊర్వశి ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ సమయంలో తన పేరుతో ఉత్తరాఖండ్‌లో ఒక గుడి ఉందని తెలిపింది అమ్మడు. "ఉత్తరాఖండ్ స్టేట్ లో నా పేరుతో టెంపుల్ ఉంది. మీరు ఎవరైనా బద్రీనాథ్ టెంపుల్ కు వెళ్లినప్పుడు, సరిగ్గా దాని పక్కనే అది మీకు కనిపిస్తుంది. ఈసారి నా గుడి కూడా సందర్శించండి" అని తెలిపింది.
"ఢిల్లీ యూనివర్సిటీలో నా ఫోటోకు పూలమాల వేసి దండమామాయి ని అంతా పిలుస్తారు. ఆ విషయం తెలిసి నేను షాకయ్యాను. వార్తలు కూడా వచ్చాయి. కావాలంటే చదివి తెలుసుకోవచ్చు. అయితే నాకు సౌత్ లో మంచి అభిమానులు ఉన్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలయ్య, పవన్ కళ్యాణ్ తో యాక్ట్ చేశాను" అంటూ గుర్తు చేసుకుంది.
అందుకే సౌత్ లో కూడా తనకు గుడి కట్టాలని ఆశిస్తున్నట్లు తెలిపింది ఊర్వశి. అదే సమయంలో మరి మీ గుడికి వచ్చిన వారు మీ ఆశీర్వాదం తీసుకుంటారా? అని యాంకర్ అడగ్గా.. ఆమె ఆసక్తికరం సమాధానం ఇచ్చింది. అది ఆలయమని, అన్ని గుడుల్లో ఏమేమి జరుగుతాయో అక్కడ కూడా అవే జరుగుతాయని చెప్పడం గమనార్హం.
మొత్తానికి ఇప్పుడు ఊర్వశి కామెంట్స్ ఫుల్ వైరల్ గా మారాయి. ఆమె ఇంటర్వ్యూ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అవుతున్నారు. ఊర్వశి మేడమ్.. ఇదేం వింత కోరిక అని అడుగుతున్నారు. ఆమె ఏదో భ్రమలో ఉందేమో అని అంటున్నారు.
ఇక కెరీర్ విషయానికొస్తే.. సింగ్ సాబ్ ది గ్రేట్ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చింది ఊర్వశి రౌతేలా. తన అందచందాలతో మెప్పించిన అమ్మడు.. తెలుగులో కూడా సందడి చేసింది. రీసెంట్ గా బాలయ్య డాకు మహారాజ్ మూవీలో దబిడి దిబిడి సాంగ్ తో అలరించిందనే చెప్పాలి. అంతకుముందు వాల్తేరు వీరయ్య, ఏజెంట్, బ్రో, స్కంద వంటి పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది. ఇప్పుడు టెంపుల్ కావాలనే వింత కోరికతో వార్తల్లో నిలిచింది.
