షారూఖ్ తర్వాత నేనే అంటూ సెల్ఫ్ డబ్బా
ఊర్వశి రౌతేలా ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించడం కొత్తేమీ కాదు. తాజాగా మసాలా కవర్ పేజీపై ఊర్వశి తళుకుబెళుకులు వైరల్ గా మారాయి
By: Tupaki Desk | 9 April 2025 10:01 PM ISTఊర్వశి రౌతేలా ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించడం కొత్తేమీ కాదు. తాజాగా మసాలా కవర్ పేజీపై ఊర్వశి తళుకుబెళుకులు వైరల్ గా మారాయి. ఇంతకుముందు వజ్రాలు పొదిగిన గడియారాన్ని ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ ఆ తర్వాత `దబిడి దిబిడి` పాటతోను చర్చల్లోకొచ్చింది. ఇప్పుడు మరోసారి ఊర్వశి పేరు మార్మోగుతోంది. ఈసారి షారుఖ్ ఖాన్‌తో తనను తాను పోల్చుకోవడంతో నెటిజనులు తమదైన శైలిలో విరుచుకుపడుతున్నారు.
తాజా ఇంటర్వ్యూలో ఊర్వశి మాట్లాడుతూ... కింగ్ ఖాన్ షారుఖ్ తర్వాత తనను తాను `ఉత్తమ ప్రమోటర్` అని గర్వంగా ప్రకటించుకుంది. ప్రచారంలో తన అంకిత భావం గురించి సెల్ఫ్ డబ్బా కొట్టింది. అయితే ఊర్వశి ఉద్దేశాన్ని నెటిజనులు సరిగా అర్థం చేసుకోలేదు. ఊర్వశి వ్యాఖ్యానం సారాంశం ఇలా ఉంది. ``షారుఖ్ ఖాన్ తర్వాత, సినిమాలను ప్రమోట్ చేయడంలో ఊర్వశి రౌతేలా ఉత్తమ ప్రమోటర్ అని జనం అంటున్నారు. అందుకే `రీచర్` సీజన్ 3 హాలీవుడ్ మేకర్స్ కూడా తమ షోను ప్రమోట్ చేయడానికి నన్ను సంప్రదించారు. కాబట్టి ప్రతి అవకాశం వెనుక ఒక కారణం ఉంది. ఇది ప్రశంసించాల్సిన క్షణం. ప్రమోటర్లుగా మేం సినిమాను, కళాకారులను ప్రమోట్ చేయకపోతే, ఎవరు చేస్తారు?`` అంటూ ప్రశ్నించింది.
అయితే ఈ అవకాశాన్ని వెంటనే రెడ్డిటర్లు వినియోగించుకున్నారు. ఊర్వశి సెల్ఫ్ డబ్బాను గట్టిగా క్యాచ్ చేసారు. ``ఆమె ఉద్దేశపూర్వకంగా ఇదంతా చెబుతోంది.. కేవలం ట్రోలింగ్ కోసం... తన గురించి చర్చ జరిగేలా చేయడానికి రెచ్చగొడుతోంది. ఏం చేస్తే ప్రమోషన్ కొట్టేయొచ్చు అనేది ఊర్వశికి కచ్చితంగా తెలుసు. ఆమె ప్రతిసారీ దారుణంగా ఏదైనా మాట్లాడితే అది తనకు మరింత ప్రచార మైలేజ్ ని ఇస్తుంది. ఇది ఆమె వ్యూహంలో భాగం`` అని ఒకరు విశ్లేషించారు. ఆలోచన భయంకరంగా ఉంది కానీ ఆమె భయంలో ఆత్మవిశ్వాసం ఉంది! అని ఇతర నెటిజన్ అన్నారు.
ఊర్వశి తదుపరి ప్రాజెక్ట్ ఏమిటి? అంటే... తదుపరి గోపిచంద్ మలినేని- సన్నీడియోల్ కాంబినేషన్ మూవీ `జాత్` లో నటిస్తోంది. ఇందులో `దిల్ తుజ్కో హి దుంగి పెహ్లే సారీ బోల్` అనే అద్భుతమైన డ్యాన్స్ నంబర్‌లో కనిపించనుంది. ఈ చిత్రంలో సన్నీ డియోల్, రణదీప్ హుడా, రెజీనా కాసాండ్రా, వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్ తదితరులు నటించారు. `జాత్` ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది.
