ఫోటో స్టోరి: ఊర్వశి మస్త్ మసాలా విందు
ఇప్పుడు మరో గ్లామ్ లుక్ తో మైండ్ బ్లాక్ చేసింది. మసాలా మ్యాగజైన్ కవర్ గర్ల్‌గా కొత్త అవతార్ లో కనిపించింది.
By: Tupaki Desk | 10 April 2025 9:38 AM ISTఊర్వశి రౌతేలా పరిచయం అవసరం లేదు. చెలరేగి వడ్డించడంలో ఈ భామ తర్వాతే. బికినీలు మోనోకినీలు స్విమ్ సూట్లతో నిరంతర జాతరే. ఇప్పుడు మరో గ్లామ్ లుక్ తో మైండ్ బ్లాక్ చేసింది. మసాలా మ్యాగజైన్ కవర్ గర్ల్‌గా కొత్త అవతార్ లో కనిపించింది. ఈసారి థై స్లిట్ గౌనులో తన అందాల్ని బో*గా తెరపరిచేసింది ఊర్వశి.
ఈ లుక్ చూడగానే `మస్త్ మసాలా ఘాటు` అంటూ యూత్ ఫిదా అయిపోతోంది. ఇది `ఫ్యాషన్ విస్పోటనం` అంటూ ఫ్యాన్స్ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. షైనీ గోల్డ్ అండ్ బ్రౌన్ ఫ్రాక్ లో ఊర్వశి మతులు చెడగొట్టింది. ఎంపిక చేసుకున్న ఈ డ్రెస్ కి తగ్గట్టే వెండి నెక్లెస్ ధరించి, రెట్రో గ్లామ్ తో ఆకర్షించింది. ముఖ్యంగా ఊర్వశి కర్లీ హెయిర్ మరింత స్పైస్ ని పెంచింది.
ఊర్వశి ఎంపిక చేసుకున్న ఫ్రాక్ కి తగ్గట్టే కాంబినేషన్ యాక్ససరీస్ ని ధరించింది. శరీరమంతా వెండి ఆభరణాలతో అలంకరించుకుంది. మెడలో నెక్లెస్, చేతికి రిస్ట్ బ్యాండ్, వాచ్, ఉంగరం, చెవి లోలాకులు ఇవన్నీ వెండితో డిజైన్ చేసినవి. ముఖ్యంగా థై స్లిట్ లుక్ లో ఊర్వశి అందచందాలను బోయ్స్ అదే పనిగా పొగిడేస్తున్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... నందమూరి బాలకృష్ణ తో `దబిడి దిబిడి` గీతంలో నర్తించిన ఊర్వశి మంటలు పెట్టింది. ప్రస్తుతం మ్యాగజైన్ కవర్ షూట్ తో మరోసారి బోల్డ్ ట్రీట్ ని అందిస్తోంది. ఫ్యాన్స్ ఈ ఫోటోగ్రాఫ్స్ ని వైరల్ గా షేర్ చేస్తున్నారు. ప్రచారార్భాటంలో తనను తాను షారూఖ్ తో పోల్చుకున్న ఈ అమ్మడికి ఇప్పుడు ట్రోలింగ్ ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తదుపరి `జాట్` చిత్రంలో సన్నీడియోల్‌తో కలిసి ఓ పాత్రలో కనిపించనుంది.
