రూ.7 వేల కోట్ల డిమాండ్‌కు AI సంస్థల కౌంటర్.. ఊర్వశి రౌతేలా లీగల్ వార్‌లో కొత్త ట్విస్ట్
పర్సనాలిటీ రైట్స్ ఉల్లంఘన కింద ఊర్వశి లీగల్ టీమ్ పంపిన నోటీసులు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారగా తాజాగా దీనిపై సంబంధిత కంపెనీలు తీవ్రంగా స్పందించాయి.
By: Srikanth Kontham | 30 Sept 2026 4:12 PM ISTబాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థల మధ్య వివాదం సంచలనం సృష్టిస్తోంది. ఊర్వశి ఫోటోలు, వీడియోలు, వ్యక్తిగత గుర్తింపును ఎలాంటి అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకున్నారంటూ ఊర్వశి లీగల్ టీమ్ ఏకంగా 7 వేల కోట్ల భారీ నష్టపరిహారాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. పర్సనాలిటీ రైట్స్ ఉల్లంఘన కింద ఊర్వశి లీగల్ టీమ్ పంపిన నోటీసులు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారగా తాజాగా దీనిపై సంబంధిత కంపెనీలు తీవ్రంగా స్పందించాయి.
ఊర్వశి రౌతేలా లేవనెత్తిన ఆరోపణలను టెక్ కంపెనీలు ఏఐ సంస్థల సీఈఓ షీరాజ్ హసన్ తాజాగా తీవ్రంగా ఖండించారు. నటి టీమ్ చేసిన డిమాండ్లు , లీగల్ హెచ్చరికలలో ఎలాంటి తార్కికత లేదని కొట్టిపారేశారు. టెక్నాలజీ యుగంలో డిజిటల్ కంటెంట్ ,ఏఐ పరిజ్ఞానంపై అవగాహన లేకుండా ఇలాంటి భారీ డిమాండ్లు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. 'మీరు అనని మాటలను, చేయని పనులను మేము సృష్టించి ప్రచారం చేశామనడం పూర్తిగా అవాస్తవం. ముందుగా మీపై , టెక్నాలజీపై మీకు స్పష్టమైన అవగాహన కల్పించుకోండి. ఏఐ అంటే ఏంటి? బాలీవుడ్‌లో దాని భవిష్యత్తు ఎలా ఉండబోతుందో? తెలుసుకున్న తర్వాత మాట్లాడండి' అంటూ ఊర్వశి బృందానికి కౌంటర్ ఇస్తూ స్టేట్‌మెంట్ విడుదల చేశారు.
డిజిటల్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టిస్తున్న అద్భుతాలను, దాని వృద్ధిని ఎవరూ ఆపలేరని షీరాజ్ హసన్ స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతికత వినోద రంగంలో అనేక కొత్త అవకాశాలను సృష్టిస్తోందని, దీనిని సానుకూల దృక్పథంతో చూడాలి తప్ప ఇలాంటి నిరాధారమైన ఆరోపణలతో అడ్డుకోవాలని చూస్తే ప్రయోజనం ఉండదని తేల్చిచెప్పారు. ఏఐ టూల్స్ వినియోగంపై సెలబ్రిటీలు మరింత విస్తృతమైన అవగాహన పెంపొం దించుకోవాలని సూచించారు.
ఈ పరిణామం సినిమా ఇండస్ట్రీలో , టెక్కీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులు, ప్రైవసీ ఒకవైపు ఉంటే మరోవైపు వేగంగా దూసుకుపోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మరోవైపు ఉంది. ఈ రెండు విభిన్న రంగాల మధ్య ఏర్పడిన ఘర్షణ రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
అంతిమంగా 7 వేల కోట్ల భారీ నష్టపరిహార డిమాండ్‌తో మొదలైన లీగల్ వార్ ఏఐ సంస్థల కౌంటర్‌తో మరింత ముదిరింది. సెలబ్రిటీల ఇమేజ్ ప్రొటెక్షన్ , ఏఐ కంటెంట్ క్రియేషన్ మధ్య సరిహద్దులు ఎక్కడ ఉండాలనే దానిపై వివాదం పెద్ద చర్చకు తెర తీస్తుంది. ఇరువర్గాల వాదనలు ఇలాగే కొనసాగితే ఈ కేసు భవిష్యత్తులో డిజిటల్ చట్టాలకు సంబంధించి కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.
