'దబిడి దిబిడి' బ్యూటీకి టైటానిక్ హీరో క్లోజ్?
ఎన్బీకే సరసన `దబిడి దిబిడి` పాటకు స్టెప్పులు వేసిన ఊర్వశి రౌతేలా చాలా కాలంగా ట్రోలర్స్ భారిన పడుతోంది.
By: Tupaki Desk | 30 May 2025 9:13 AM ISTఎన్బీకే సరసన `దబిడి దిబిడి` పాటకు స్టెప్పులు వేసిన ఊర్వశి రౌతేలా చాలా కాలంగా ట్రోలర్స్ భారిన పడుతోంది. దిబిడి దిబిడి ఇన్ స్టంట్ గా మాస్ లో హిట్టయిన తరువాత తనను తాను బోల్డ్ గా పబ్లిసిటీ చేసుకుంటూ నెటిజనులకు దొరికిపోతోంది ఈ పంజాబీ బ్యూటీ.
బాలీవుడ్ లో సరిగా అవకాశాల్లేవ్. సౌత్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. దానికోసం తనను ఇక్కడ ప్రమోట్ చేసుకునేందుకు నిరంతరం ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవుతోంది. అయితే చాలా సార్లు ఊర్వశి ఇన్ స్టా ప్రమోషనల్ పోస్టులు మిస్ ఫైర్ అవుతున్నాయి. బోల్డ్ బ్యూటీ ఏమాత్రం అవకాశం ఇచ్చినా నెటిజనులు ఆటాడుకుంటున్నారు. ఇప్పుడు మరోసారి తాను టైటానిక్ హీరోకి పెట్ ని అన్న రేంజులో రెచ్చిపోయింది.
టైటానిక్ స్టార్, ప్రముఖ హాలీవుడ్ నటుడు డికాప్రియో తనను కేన్స్ క్వీన్ అని ప్రశంసించినట్టు వెల్లడించింది. డికాప్రియోతో కలిసి ఉన్న ఓ ఫోటోని ఇన్‌స్టాలో షేర్ చేసిన ఊర్వశి రౌతేలా అతడికి ఎంతో సన్నిహితంగా కనిపించింది ఎంతగానో క్లోజ్ అనే అనుభూతిని పొందింది. ``లియోనార్డో డికాప్రియో మిమ్మల్ని కేన్స్ రాణి అని పిలిచినప్పుడు! ధన్యవాదాలు, లియో... ఇప్పుడు అది టైటానిక్ ప్రశంస`` అని క్యాప్షన్‌లో ఉర్వశి రాసింది. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. ఊర్వశి సన్నిహితుడైన ఓర్రీ వ్యాఖ్యల విభాగంలో ఇలా రాశాడు. ``అతడు మిమ్మల్ని కేన్స్ క్వీన్ అని పిలిచినప్పుడు మీకు ఏమనిపించింది? కేన్స్ క్వీన్ సరే.. ఇంకా ఏమేమి అన్నాడు? ?? దీదీ ?? బెంజీ??? ఊర్వశి బాయి ??? అంటూ ఆట పట్టించాడు.
ఊర్వశిని నెటిజనులు ఒక రేంజులో ఆడుకున్నారు.. కామెంట్లతో విరుచుకుపడ్డారు. లియోనార్డో డికాప్రియో.. నిన్ను కేన్స్ రాణి అని పిలిచాడు తెలుసా? అని ఒక యూజర్ రాశాడు. డాకు మహారాజ్, దబిది దిబిడి చూశాక అతడు నిన్ను గుర్తించాడా? అని మరొక కామెంట్ వేడెక్కించింది. ఊర్వశి స్వీయ ప్రచార వ్యామోహంపైనా కొందరు కామెంట్లు చేసారు. ఊర్వశి రౌతేలా గత వారం ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేసింది. ఊర్వశి డ్రెస్సింగ్ సెన్స్ సహా ప్రతిదీ విమర్శలను ఆకట్టుకోలేకపోయాయి.
