బాలయ్య సినిమాను తెగ వాడేసుకుంటున్న బ్యూటీ!
నందమూరి బాలకృష్ణ మొన్న సంక్రాంతికి 'డాకు మహారాజ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 10 April 2025 12:43 PM ISTనందమూరి బాలకృష్ణ మొన్న సంక్రాంతికి 'డాకు మహారాజ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. రామ్ చరణ్, శంకర్‌ల కాంబోలో రూపొంది సంక్రాంతికి వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమాతో పోల్చితే 'డాకు మహారాజ్' సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మొదటి రెండు రోజులు మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. కానీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో డాకు మహారాజ్ సినిమా వసూళ్లు భారీగా డ్రాప్ అయ్యాయి. పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ డాకు మహారాజ్ సినిమాకు ఒకటి రెండు చోట్ల తప్ప ఎక్కడా బ్రేక్ ఈవెన్ కాలేదని సమాచారం. డాకు మహారాజ్ సినిమా ఓటీటీలో మాత్రం మంచి స్పందన దక్కించుకుంది.
డాకు మహారాజ్ సినిమాతో నిర్మాతకు ఓవరాల్‌గా బ్రేక్ ఈవెన్ అయినప్పటికీ థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్న వారు మాత్రం నష్టపోయారని టాక్ వినిపిస్తుంది. బాలయ్య కెరీర్‌లో వరుసగా మూడో విజయం అంటూ మేకర్స్‌తో పాటు, ఫ్యాన్స్ ప్రచారం చేస్తున్నారు. సినిమా ఫ్లాప్ అనడానికి లేదు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా కారణంగా వసూళ్లు డ్రాప్ అయ్యాయే కానీ, సినిమాకు నెగటివ్ టాక్ అయితే రాలేదు. అందుకే డాకు మహారాజ్ సినిమాను నందమూరి ఫ్యాన్స్ హిట్ ఖాతాలోనే వేసుకుంటున్నారు. నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా హీరోయిన్ ఊర్వశి రౌతేలా కూడా డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్ అంటూ పదే పదే సోషల్ మీడియా ద్వారా, మీడియా సమావేశంలో మాట్లాడుతూ కనిపిస్తుంది.
ఈ సినిమాలో దబిడి దిబిడి సాంగ్‌లో కనిపించడంతో పాటు, కీలక సన్నివేశాల్లోనూ ఊర్వశి కనిపించింది. యాక్షన్ సన్నివేశాల్లోనూ ఈమె నటించిన విషయం తెల్సిందే. ఇతర ఇద్దరు హీరోయిన్స్‌తో పోల్చితే ఈమెకు స్క్రీన్ టైమ్ ఎక్కువ లభించింది. అందుకే ఈ సినిమాలో బాలకృష్ణ తర్వాత ఆమె ప్రధాన ఆకర్షణగా నిలిచింది. డాకు మహారాజ్ సినిమాలో తాను చేసిన దబిడి దిబిడి సాంగ్‌కు వస్తున్న రెస్పాన్స్‌ను చూపిస్తూ మరిన్ని ఆఫర్లు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఈమధ్య కాలంలో ఐటెం సాంగ్స్‌కి మంచి క్రేజ్ ఉంది. కనుక ఈ అమ్మడు దబిడి దిబిడి సాంగ్ హిట్ నేపథ్యంలో మరిన్ని ఆఫర్లను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
డాకు మహారాజ్ సినిమా గురించి, అందులోని దబిడి దిబిడి సాంగ్ గురించి ఈ అమ్మడు ప్రముఖంగా మాట్లాడుతోంది. పాట వివాదాస్పదం కావడం కూడా ఈమెకు కలిసి వచ్చింది. పాట వివాదం గురించి పలు సందర్భాల్లో స్పందించింది. ఏ సినిమా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటుందో, ఆ సినిమా గురించి విమర్శలు వస్తాయి. వాటి గురించి తాను పట్టించుకోను అని, ప్రేక్షకుల అభిమానం తనకు ముఖ్యం అని, మరిన్ని అలాంటి సినిమాలు పాటలు చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ముందు ముందు డాకు మహారాజ్ సినిమా వల్ల ఊర్వశి రౌతేలాకు మరిన్ని ఆఫర్లు దక్కొచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
