Begin typing your search above and press return to search.

యాయీరే యాయీరే వారేవా ఇది ఏం జోరే

`రంగీలా` సినిమాలోని ఈ పాట‌ను కానీ, ఇందులో అభిన‌యించిన ఊర్మిళ‌ను కానీ 90ల నాటి యూత్ ఇంకా మ‌ర్చిపోలేదు. ఇప్ప‌టికీ ఈ పాట యూట్యూబ్ లో ట్రెండ్ సెట్ట‌ర్.

By:  Tupaki Desk   |   23 Jun 2025 9:25 AM IST
యాయీరే యాయీరే వారేవా ఇది ఏం జోరే
X

యాయీరే యాయీరే వారేవా ఇది ఏం జోరే... యాయీరే యాయీరే ఈ జోరుకు నా జోహారే..


కళ్ళలో కలలుంటే గుండెల్లో దమ్ముంటే... రోజు రంగేళిలే రంగ్ రంగ్ రంగేళిలే..


యాయీరే యాయీరే వారేవా ఇది ఎంజోరె... యాయీరే యాయీరే ఈ జోరుకు నా జోహారే


కళ్ళలో కలలుంటే గుండెల్లో దమ్ముంటే ..... రోజు రంగేళిలే రంగ్ రంగ్ రంగేళిలే.....

`రంగీలా` సినిమాలోని ఈ పాట‌ను కానీ, ఇందులో అభిన‌యించిన ఊర్మిళ‌ను కానీ 90ల నాటి యూత్ ఇంకా మ‌ర్చిపోలేదు. ఇప్ప‌టికీ ఈ పాట యూట్యూబ్ లో ట్రెండ్ సెట్ట‌ర్. ఊర్మిళ మ‌టోండ్క‌ర్ అంద‌మైన హావ‌భావాలు, టీజింగ్ యాటిట్యూడ్ కి ఫిదా కాని వారు లేరు. సినిమా హిస్ట‌రీలో త‌మ‌కంటూ ఒక పేజీని లిఖించుకున్న‌ అరుదైన న‌టీమ‌ణులు కొంద‌రే ఉంటారు. అందులో ఊర్మిళ పేరు కూడా ఉంది అంటే దానికి కార‌ణం రంగీలా సినిమా.

ఇటీవ‌ల ఊర్మిళ న‌ట‌నలోకి రీఎంట్రీ కోసం త‌హ‌త‌హ‌లాడుతున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. దీనికోసం ప‌ర్ఫెక్ట్ ఫిట్ లుక్ కి మారార‌ని కూడా ముంబై మీడియా ఊద‌ర‌గొడుతోంది. తాజాగా ఊర్మిళ లుక్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారాయి. ఈ అంద‌మైన వెట‌ర‌న్ న‌టి ఎంతో ప్లెజెంట్ గా చుట్టూ ఉన్న ప‌రిస‌రాల‌ను ఆస్వాధిస్తోంది. బ్లాక్ ఫ్రాక్ ధ‌రించి ఊర్మిళ ఎంతో ఫిట్ గా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారింది.