Begin typing your search above and press return to search.

ఉర్పీ చుట్టూ ఉప‌గ్ర‌హాలు రౌండ్లేస్తున్నాయ్!

స్టైల్ కా బాప్ ఉర్పీ జావేద్ గురించి ప‌రిచయం అవ‌స‌రం లేదు. త‌న‌దైన శైలి డ్రెస్సింగ్ స్టైల్ తోనే త‌న‌కం టూ ఓ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది

By:  Tupaki Desk   |   20 March 2024 2:06 PM GMT
ఉర్పీ చుట్టూ ఉప‌గ్ర‌హాలు రౌండ్లేస్తున్నాయ్!
X

స్టైల్ కా బాప్ ఉర్పీ జావేద్ గురించి ప‌రిచయం అవ‌స‌రం లేదు. త‌న‌దైన శైలి డ్రెస్సింగ్ స్టైల్ తోనే త‌న‌కం టూ ఓ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. రొటీన్ కి భిన్నమైన డ్రెస్సులు ధ‌రించ‌డంతో అమ్మ‌డు అంత పాపుల‌ర్ అయింది. బాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. కానీ వాళ్ల‌ను మించిన‌ పాపు లారిటీ కేవ‌లం డ్రెస్సింగ్ స్టైల్ తోనే అందుకుంది. ఆమె ఫాలోయింగ్ ఏ స్థాయికి చేరిందంటే చివ‌రికి కొంత మంది హీరోయిన్లు ఉర్పీని చూసి కుళ్లుకునేంత అన‌డంలో అతిశ‌యోక్తి లేదు.

ఇండియాలోనే కాదు..ప్ర‌పం చంలోనే త‌న‌లా స్టైలింగ్ కాలేర‌ని ఎన్నోసార్లు రుజువు చేసింది. ఆ డిజైన‌ర్ దుస్తులతో అమ్మ‌డు ప‌బ్లిక్ లో చేసేహ‌డావుడి అంతా ఇంతా కాదు. ఇలాంటి డ్రెస్సులేసుకుని ఎందుకు జ‌నాల్లో తిరుగున్నావ్ అంటే? మామూలు క్లాత్ బ‌ట్ట‌లైతే త‌న ఒంటికి ప‌డ‌ద‌ని..శ‌రీరానికి ఎల‌ర్జీ ఉంద‌ని. .ఇది త‌న‌కి దేవుడు పెట్టిన శాప‌మంటూ చెబుతుంది. తొలుత ఇదంతా నిజ‌మే అని అంతా న‌మ్మారు. కానీ త‌ర్వాతే అర్ద‌మైంది ఇదంతా క‌హానీ అని.

విమ‌ర్శ‌ల నుంచి ఎస్కేప్ అవ్వ‌డం కోసం అలా అబ‌ద్దం చెప్పింది. కేవ‌లం పాపులారిటీ కోస‌మే అలాంటి దుస్తుల్లో క‌నిపిస్తుంటుంది. తాజాగా అమ్మ‌డు ఓ గౌను ధ‌రించింది. అందులో అచ్చంగా బుట్ట‌బొమ్మ‌లాగే ఉంది. ఆ సంగ‌తి న‌డుం ద‌గ్గ‌ర నుంచి కాళ్ల వ‌ర‌కూ ఎత్తుగా ఉన్న గౌను లోప‌ల ఉప‌గ్ర‌హాల‌వలే క‌నిపిస్తు న్నాయి. గ్ర‌హాల చుట్టూ ఉప‌గ్ర‌హాలు ఎలా తిరుగుతాయో? ఉర్పీ అనే గ్ర‌హం చూట్టు లోప‌ల ఉన్నా ఆ ఉప గ్ర‌హాలు అలాగే తిరుగుతున్న‌ట్లు క‌నిపిస్తుంది.

కింద నుంచి పొగ ఎఫెక్ట్ ని గ‌మ‌నించ వ‌చ్చు. సూర్యుడ్ని కేంద్రంగా చేసుకుని గ్ర‌హాలు..ఉప‌గ్ర‌హాలు తిర‌గుతున్న‌ట్లే ఉంది సుమీ. అచ్చంగా కోప‌ర్నీ క‌స్ ప్ర‌తిపాదించిన సూర్య‌కేంద్ర సిద్దాంత‌మే క‌నిపిస్తోం దిక్క‌డ‌. ఇన్ని చేస్తున్నా ఉర్పీ కి మాత్రం బాలీవుడ్ లో అవ‌కాశాలు రావ‌డం లేదు. ఇప్పుడు వ‌చ్చి సినిమాలు చేయ‌డం కన్నా ఇంత‌కు మించి పాపులారిటీ అయితే ద‌క్క‌దు.