Begin typing your search above and press return to search.

హాస్పిటల్‌ బెడ్‌ పై బ్యూటీ... అసలేం జరిగింది?

ఇంతలో ఉర్ఫీ కి ఏమైంది... కరోనా ఏమైనా ఎటాక్‌ అయ్యిందా అంటూ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు.

By:  Tupaki Desk   |   4 Jan 2024 12:24 PM GMT
హాస్పిటల్‌ బెడ్‌ పై బ్యూటీ... అసలేం జరిగింది?
X

బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు సోషల్ మీడియా జనాలకు ఉర్ఫీ జావేద్‌ సుపరిచితురాలు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్‌ బాస్ లో పాల్గొనడం ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ఉర్ఫీ జావేద్‌ ఆ తర్వాత సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తోంది.

వింత వింత ఔట్‌ ఫిట్స్ తో విచిత్రమైన వేషధారణ తో ఉర్ఫీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే ఫోటోలు మరియు వీడియోలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. కొన్ని ఆలోచింపజేస్తే, కొన్ని చీ అన్నట్టుగా ఉంటాయి. మొత్తానికి వార్తల్లో నిలుస్తోంది.

తాజాగా ఉర్ఫీ ఆక్సీజన్ మాస్క్ పెట్టుకుని హాస్పిటల్‌ బెడ్‌ పై ఉన్న ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇంతలో ఉర్ఫీ కి ఏమైంది... కరోనా ఏమైనా ఎటాక్‌ అయ్యిందా అంటూ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు.

ఆ ఫోటో షేర్‌ చేసిన కొద్ది సమయంకే ఉర్ఫీ క్యాన్సర్‌ పేషంట్స్ సేవా కార్యక్రమం అంటూ ఒక రెస్టారెంట్ లో కొంత సమయం వెయిటర్‌ గా చేసినట్లుగా పేర్కొంది. తద్వారా వచ్చిన డబ్బును విరాళంగా ఇచ్చినట్లుగా పేర్కొంది. ఇంతకు ఉర్ఫీ ఆ ఫోటో వెనుక స్టోరీ ఏంటి అనేది మాత్రం తెలియజేయలేదు.