Begin typing your search above and press return to search.

పాపం... ఈమె పరిస్థితి ఏమి బాగాలేదట

పెద్దగా సినిమాల్లో నటించకున్నా, బిగ్‌ బాస్‌కి వెళ్లినా అక్కడ ఎక్కువ రోజులు లేకున్నా ఉర్ఫీ జావేద్‌ సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   15 May 2025 12:30 PM
Urfi Javed Breaks Silence on Social Media Absence
X

పెద్దగా సినిమాల్లో నటించకున్నా, బిగ్‌ బాస్‌కి వెళ్లినా అక్కడ ఎక్కువ రోజులు లేకున్నా ఉర్ఫీ జావేద్‌ సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఎంతో మంది హీరోయిన్స్‌తో పోల్చితే సోషల్‌ మీడియాలో ఉర్ఫీకి ఉన్న ఫాలోయింగ్‌ ఎక్కువ అని చెప్పాలి. సోషల్‌ మీడియాలో ఈమెకు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె రకరకాలుగా ఔట్ ఫిట్‌లో కనిపించడం ద్వారా అన్ని భాషల ప్రేక్షకుల్లోనూ ఈమెకు గుర్తింపు లభించింది. సినిమాల్లో ఆఫర్ల కోసం చాలా ప్రయత్నించినప్పటికీ పెద్దగా ఆఫర్లు రావడం లేదు. అయినా ఇండస్ట్రీలో కొనసాగేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సోషల్‌ మీడియాలో ఈమె జోరు కొనసాగుతోంది.

ఉర్ఫీ జావేద్‌ ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా కనిపించడం లేదు. గతంతో పోల్చితే ఉర్ఫీ ఎక్కువగా ఔట్‌ ఫిట్‌లను ట్రై చేయడం లేదు. పైగా ఈమె సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ పోస్ట్‌లను సైతం షేర్ చేయడం లేదు. దాంతో చాలా మంది ఉర్ఫీ జావేద్‌ కనిపించడం లేదు అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఉన్నట్టుండి ఉర్ఫీకి ఏమైంది అంటూ కొందరు కామెంట్‌ చేస్తే, మరికొందరు ఉర్ఫీకి ఇండస్ట్రీపై ఆసక్తి తగ్గిందేమో, ముందు ముందు కూడా ఆమె సోషల్‌ మీడియాకు మరింతగా దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇలా వచ్చి పోయే వారు చాలా మంది ఉంటారు, అందులో ఉర్ఫీ ఒకరు అని పలువురు కామెంట్‌ చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో ఉర్ఫీ జావేద్‌ నుంచి ఆసక్తికర పోస్ట్‌ వచ్చింది. గత కొన్నాళ్లుగా తాను సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా లేకపోవడంకు కారణం పరిస్థితులు అనుకూలించక పోవడం అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఉర్ఫీ తన ఆరోగ్యం విషయంలోనూ ఆందోళనకరంగా ఉన్నట్లు పేర్కొంది. కొన్ని పరిస్థితుల కారణంగా తాను సోషల్‌ మీడియాలో మునుపటి మాదిరిగా యాక్టివ్‌గా ఉండలేక పోతున్నాను. ఈ మధ్య కాలంలో నేను అనుకున్నట్లుగా ఏది జరగడం లేదు. ముందు ముందు అయినా ఇలాంటి పరిస్థితుల నుంచి బయటకు వస్తాను అనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది. తాను మొదలు పెట్టిన వ్యాపారాల్లో ఏ ఒక్కటి సాఫీగా సాగడం లేదని వాపోయింది.

కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కి వెళ్లాలని చాలా ప్రయత్నించాను, అందుకోసం నాకు చాలా మద్దతు లభించింది. కానీ చివరి నిమిషంలో వీసా రాకపోవడం వల్ల వెళ్లలేకపోయాను. అప్పటి నుంచి కూడా నా మానసిక పరిస్థితి బాగాలేదని, తాను డిప్రెషన్‌లో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. కాలం ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండదు. మీకు మంచి రోజులు వస్తాయి, తప్పకుండా మీరు మునుపటి ఉత్సాహంతో ముందుకు వస్తారనే నమ్మకం ఉంది అంటూ సోషల్‌ మీడియా ద్వారా పలువురు ఉర్ఫీ జావేద్‌కి మద్దతుగా నిలుస్తున్నారు. నటిగా ఇకపై కూడా ఉర్ఫీకి ఆపర్లు రావడం సాధ్యం కాదు. కానీ సోషల్‌ మీడియాలో ఆమె యాక్టివ్‌గా మారడం మాత్రం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.