వీడియో: అంజనీ పుత్రికలా మారిందేమిటీ ఊర్ఫీ?
ఉర్ఫీ జావేద్ ఇటీవల వెబ్ మీడియాలో ఊహించని ఇలాంటి ఒక ప్రత్యేక కారణంతో సంచలనంగా మారింది.
By: Tupaki Desk | 22 July 2025 7:31 PM ISTఫిల్టర్‌లెస్‌గా జీవించడం కొందరికే తెలుసు. ముఖం వాచినా లేదా పెదవులు ఉబ్బినా పబ్లిగ్గా చూపించడానికి చాలా గుండె ధైర్యం కావాలి. సెలబ్రిటీ ప్రపంచంలో చాలా మంది నటీమణులు బుగ్గపై మొటిమలను కూడా చూపించేందుకు సిద్ధంగా ఉండరు. అలాంటిది.. ఇప్పుడు నటి కం సోషల్ మీడియా సెన్సేషన్ ఊర్ఫీ జావేద్ తన వాచిన పెదవులను, బాగా ఉబ్బిన బుగ్గలను చూపించేందుకు ఎంతమాత్రం వెనకాడలేదు. ఏకంగా వీడియో షూట్ చేసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఉర్ఫీ జావేద్ ఇటీవల వెబ్ మీడియాలో ఊహించని ఇలాంటి ఒక ప్రత్యేక కారణంతో సంచలనంగా మారింది. ప్రస్తుతం తన పెదవులపై ఉన్న ఫిల్లర్లను కరిగించిన తర్వాత మారిన వికృత రూపం భయపెడుతోంది. ఈ ప్రక్రియతో చాలా నొప్పిని భరించానని చెబతోంది. ఫిల్లర్ల తొలగింపు ప్రక్రియ చేయించుకున్నప్పటి నుండి తన ఆరోగ్యంలో మార్పులు, హెచ్చు తగ్గుల గురించి సోషల్ మీడియాలో ప్రతిదీ వెల్లడిస్తోంది. అయితే ఇటీవల తన వాచిన ముఖాన్ని ఎగతాళి చేస్తూ ప్రియుడు చేసిన వ్యాఖ్యను షేర్ చేసింది. ``నా ప్రియుడు నన్ను ఇలా చూసి, నాకు కె మై బాత్ బాత్ పె ముహ్ ఫూలా లేటి హు అని చెప్పాడు... నిజమేనా?` అని క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఊర్ఫీకి ఏమైందో అనే ఆందోళన మాత్రం అభిమానుల్ని నిలవనీయడం లేదు. పెదవి ఫిల్లర్ వాపు నిజంగా భయపెడుతోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మీరు ఇప్పుడు బావున్నారని భావిస్తున్నానని ఒక అభిమాని వ్యాఖ్యానించారు. లిప్ ఫిల్లర్ల కారణంగా అంజనీ పుత్రికలా మారింది అంటూ ఒక అభిమాని కామెంట్ చేసాడు.
ఫ్యాషనిస్టా ఊర్ఫీ కొన్ని రోజుల క్రితం ఫిల్లర్ రిమూవల్ ప్రక్రియ చేయించుకుంది. ఆ తర్వాత ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. నా ఫిల్లర్లు అన్నీ తప్పుగా వేయడంతో వాటిని కరిగించాలని నిర్ణయించుకున్నాను. ఇలాంటి చికిత్స కోసం సుశిక్షితులైన వైద్యుల వద్దకు మాత్రమే వెళ్లాలి.. సహజంగా వాటిని చేయించుకోవాలి అని చెప్పింది. ఊర్ఫీ ఇటీవల సోషల్ మీడియాలతో పాటు, ఓటీటీల్లోను పాపులర్ ఫేస్. కసౌతి జిందగీ కే 2, యే రిష్టా క్యా కెహ్లతా హై, బెపన్నా వంటి టీవీ షోలతో పాపులరైంది.
