కేన్స్ గుట్టు మట్లు విప్పిన ఫ్యాషనిస్టా ఊర్ఫీ
బ్రాండ్‌లు రెడ్ కార్పెట్‌కు టిక్కెట్లు కొనుగోలు చేసి, ప్రచారం కల్పించే లేదా ప్రభావితం చేసేవారికి, సెలబ్రిటీలకు ఇస్తారు. సాధారణ వ్యక్తులు కూడా టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు.
By: Tupaki Desk | 17 May 2025 7:58 PM ISTబోల్డ్ సెలక్షన్‌తో ఫ్యాషన్ సరిహద్దులు చెరిపేసిన బ్యూటీ ఊర్ఫీ జావేద్. ఈ భామ కేన్స్ 2025 ఫెస్టివల్ లో సందడి చేసేందుకు చాలా ప్లాన్ చేసినా, వీసా తిరస్కరణ కారణంగా హాజరు కాలేకపోయింది. ఈ సందర్భంగా ఊర్ఫీ ఏమాత్రం నిరశ చెందక మరో అవకాశం కోసం ప్రయత్నిస్తానని పాజిటివ్ గా స్పందించింది.
అయితే కేన్స్ లో పాల్గొనడం అంటే అదేదో నెత్తిపై కుంపటి పెట్టుకున్నట్టు కాదని, టికెట్లు కొనుక్కుని ఎవరైనా వెళ్లొచ్చని చెప్పింది. ఈ వేదికలకు వెళ్లడానికి అర్హత అవసరం లేదని, స్పానర్ చేసేవాళ్లు ఉంటే చాలని ఊర్ఫీ జావేద్ చెప్పింది. కేన్స్ 2025 ఉత్సవాలకు వెళ్లేందుకు తనకు స్పాన్సర్ చేసేవాళ్లు ఉన్నా కానీ, వీసా రిజెక్షన్ నిరాశపరిచిందని తెలిపింది. కేన్స్ రెడ్ కార్పెట్ పై ప్రభావశీరులు, ఇతర సెలబ్రిటీలు హాజరు కావడానికి స్పాన్సర్ షిప్ ఉంటుందని, విమానం టికెట్లు సహా వసతుల ఏర్పాటు వగైరా అన్నీ వాళ్లే చూసుకుంటారని కూడా ఊర్ఫీ జావేద్ వెల్లడించింది.
ఊర్ఫీ ఇన్ స్టాలో ఇలా సందేశం ఇచ్చింది. ''కేన్స్‌కు వెళ్లడం అనేది మీ యోగ్యతపై ఆధారపడి లేని అవకాశం. బ్రాండ్‌లు రెడ్ కార్పెట్‌కు టిక్కెట్లు కొనుగోలు చేసి, ప్రచారం కల్పించే లేదా ప్రభావితం చేసేవారికి, సెలబ్రిటీలకు ఇస్తారు. సాధారణ వ్యక్తులు కూడా టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. కేన్స్ రెడ్ కార్పెట్‌పై నడవడం ఒక విజయం కాదు.. నాకు కూడా వర్తించదు. ఇది మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకునే అవకాశం. అదే నిజం. నేను నిజం చెబుతున్నాను'' అని ఊర్ఫీ రాసింది. మీ సినిమా ఫెస్టివల్ లో ప్రీమియర్ అయితే అది ఒక విజయం. డబ్బు ఉంటే, స్పాన్సర్ ఉంటే ఎవరైనా దీనిని సాధ్యం చేయగలరు.. అని చెప్పింది.
కేన్స్ కి వెళ్లడానికి ఇండీ వైల్డ్ తనకు స్పాన్సర్ చేసిందని, కానీ నా వీసా తిరస్కరించరించారని ఊర్ఫీ బాధను వ్యక్తం చేసింది. తిరస్కరణలు ముగింపు కాదని, మరింత కష్టపడి పనిచేయడానికి ఒక ప్రోత్సాహకం అని తాను నమ్ముతున్నానని ఉర్ఫీ తెలిపింది.
బెపన్నా, మేరీ దుర్గా సహా పలు టెలివిజన్ షోలలో కనిపించిన ఉర్ఫీ, రియాలిటీ షో బిగ్ బాస్ OTT 1లో పాల్గొన్న తర్వాత బాగా పాపులరైంది. 2024లో లవ్ సెక్స్ ఔర్ ధోఖా 2 చిత్రంలో నటించింది. గత సంవత్సరం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రదర్శించిన రియాలిటీ సిరీస్ 'ఫాలో కర్ లో యార్'లో కూడా కనిపించింది.
