అబ్బాయిలు సిగ్గుతో తల దించుకునే సలహా ఇచ్చిన ఊర్ఫీ
సోషల్ మీడియా- డిజిటల్ యుగంలో యూత్ క్లిక్ లు లైక్ ల హోరులో కొట్టుకుపోతోంది. ఎన్ని లైక్ లు వస్తే అంత క్రేజ్.
By: Tupaki Desk | 17 Jun 2025 1:30 AMసోషల్ మీడియా- డిజిటల్ యుగంలో యూత్ క్లిక్ లు లైక్ ల హోరులో కొట్టుకుపోతోంది. ఎన్ని లైక్ లు వస్తే అంత క్రేజ్. ఎన్ని షేర్లు అయితే అంతగా ఆదాయం. కారణం ఏదైనా డబ్బు సంపాదించడానికి యువతరం ఎంచుకుంటున్న ఈ మార్గం తీవ్రమైన విమర్శలకు తావిస్తోంది. ధనార్జన కోసం అతిగా దిగజారిపోవడానికి కూడా యువతరం వెనకాడటం లేదు. ఇన్ స్టా, యూట్యూబ్ సహా ఇతర మార్గాల్లో ఆదాయాల కోసం వెంపర్లాటలో అందమైన అమ్మాయిలు విలువలకు తిలోదకాలిచ్చి వలువలు ఒలిచేస్తుంటే, అది చూస్తున్న సాంప్రదాయవాదులు ప్రపంచం ఎటు పోతోంది! అంటూ విలవిలలాడుతున్నారు.
సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా ఏం లేదు ఇప్పుడు. అందరికీ సమాన హోదా లభిస్తోంది సోషల్ మీడియాలో. క్లిక్ లు లైక్ లు పెంచుకునే తంత్రం తెలిస్తే చాలు. చాలా మంది సామాన్యులు కూడా సెలబ్రిటీలు అయిపోతున్నారు. యూట్యూబర్లుగా, ఇన్ ఫ్లూయెన్సర్లుగా, బ్లాగర్లుగా ఎదిగేస్తున్నారు. సెలబ్రిటీలు బోల్డ్ ఫోటోషూట్లతో యూత్ కి గాలం వేస్తున్నారు. ఊర్ఫీ జావేద్ లాంటి ఒక మోడల్ కం నటి ఎలా పాపులరైందో అందరికీ తెలుసు. ఊర్ఫీని అనుసరించేవాళ్లు కోకొల్లలు. అయితే సాన్య మల్హోత్రా లాంటి కొందరు కొంత ట్రెడిషన్ ని అనుసరిస్తున్నారు. ఫిట్ నెస్ కోసం జిమ్ లో శ్రమించే వీడియోలు, ఫోటోలను షేర్ చేసినా కానీ టూమచ్ అనిపించేవి ఏవీ కనిపించవు. అయితే అందుకు భిన్నంగా ఊర్ఫీ జావేద్ లాంటి నటీమణి ఫ్యాషన్ సెన్స్ పేరుతో నగ్నత్వాన్ని ప్రమోట్ చేసిన సందర్భాలున్నాయి. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. వివాదాలతో నిరంతరం అంటకాగడం ద్వారా కూడా పబ్లిక్ లో పాపులరైంది ఊర్ఫీ. ఏది ఏమైనా, సోషల్ మీడియా రెవెన్యూని, వాటి ద్వారా ప్రకటనల ఆదాయాన్ని పెంచుకోవడంలో ఊర్ఫీ పెద్ద సక్సెసైంది. ఇప్పుడు చాలా మంది యూత్ తనను అనుకరించేవాళ్లు ఉన్నారు.
ఇదిలా ఉంటే, అమ్మాయిలు అయితే అందాలను ప్రదర్శిస్తే చాలు.. అదే అబ్బాయిలకు ఫాలోవర్స్ పెరగాలంటే ఎలా? అంటూ సాన్య మల్హోత్రా నేరుగా ఊర్ఫీని ప్రశ్నించింది. అబ్బాయిలు కూడా ఆ* , బూ* ని ప్రదర్శిస్తే చాలు.. అంటూ బోల్డ్ సలహా ఇచ్చింది ఊర్ఫీ జావేద్. అంతేకాదు అబ్బాయిలు బోల్డ్ గా ఏదైనా చూపిస్తే చూడటం తనకు చాలా ఇష్టం అని కూడా చెప్పింది. అంతేకాదు.. గయ్స్ మీ ఆ* , బూ*(B**bs) ని యథేచ్ఛగా ప్రదర్శించండి అంటూ ఉచిత సలహా కూడా పడేసింది. సాన్యా వర్సెస్ ఊర్ఫీ చర్చల్లో నిజం ఉన్నా కానీ, మరీ బోల్డ్ గా ఆ సలహాలు వినేందుకు అబ్బాయిలే కాస్త సిగ్గు పడుతున్నారు.