Begin typing your search above and press return to search.

ఊర్వ‌శి ఫోన్ దొరికింది కానీ ఇవ్వాలంటే ఉఫ్..!

ఊర్వశి రౌతేలా తన ఐఫోన్ త‌న‌కు దొరికింద‌ని చెబుతూ.. ఒక అభిమాని నుండి ఇమెయిల్ వచ్చింది. ఇమెయిల్‌లో ప్రత్యేక డిమాండ్ ఏంటంటే?

By:  Tupaki Desk   |   21 Oct 2023 2:45 AM GMT
ఊర్వ‌శి ఫోన్ దొరికింది కానీ ఇవ్వాలంటే ఉఫ్..!
X

ఐసిసి ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగిన హైవోల్టేజ్ ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌లో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఫోన్ దొరికిన‌వారు త‌న‌కు ఇచ్చేస్తే అద్బుత‌మైన కానుక ఉంటుంద‌ని ఊర్వ‌శి ఊరించింది. ఇంత‌లోనే ఒక అభిమాని ఆమె ఫోన్‌ని కనుగొన్నాడు. కానీ అతడు దానిని ఒక షరతుపై మాత్రమే తిరిగి ఇస్తాన‌ని కండీష‌న్ పెట్టాడు.

ఊర్వశి రౌతేలా తన ఐఫోన్ త‌న‌కు దొరికింద‌ని చెబుతూ.. ఒక అభిమాని నుండి ఇమెయిల్ వచ్చింది. ఇమెయిల్‌లో ప్రత్యేక డిమాండ్ ఏంటంటే? ఆమె ఫోన్ రికవరీ మాత్రమే కాదు.. అది తిరిగి ఇవ్వాలంటే ఒక కండీష‌న్ అంటూ రాసుకొచ్చాడు. ఈమెయిల్ సబ్జెక్టులో 'నా దగ్గర మీ ఫోన్ ఉంది..మీకు కావాలంటే, నా సోదరుడిని క్యాన్సర్ నుండి రక్షించడానికి మీరు నాకు సహాయం చేయాలి'' అని పేర్కొన్నాడు.

గ్రో ట్రేడర్స్ ఇమెయిల్ ఐడి ద్వారా ఊర్వశికి ఇమెయిల్ అందింది. ఊర్వశి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సాధారణ థంబ్స్-అప్ ఎమోజీతో అభిమానుల అభ్యర్థనను అంగీకరిస్తూ ఇమెయిల్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. ఫోన్ పోగొట్టుకున్న త‌ర్వాత ఊర్వ‌శి గంద‌ర‌గోళంలో ప‌డింది. కానీ ఇదంతా ప‌బ్లిసిటీ స్టంట్ అంటూ చాలామంది నెటిజ‌నులు కొట్టి ప‌డేసారు. కానీ ఇప్పుడు ఆ ఫోన్ ఒక అవ‌స‌రార్థికి, క‌ష్టంలో ఉన్న వ్య‌క్తికి దొరికింది. అత‌డు స‌హేతుక‌మైన కోరిక కోరాడా? అన్న‌ది ఆలోచించాలి.

అక్టోబరు 16న ఊర్వశి తన ఎక్స్ లో నెటిజన్ల నుండి సహాయం కోరుతూ స్టేడియంలో తన '24 క్యారెట్ రియల్ గోల్డ్ ఐఫోన్' పోగొట్టుకున్నట్లు తెలిపింది. ఆమె పోగొట్టుకున్న ఫోన్ ఫిర్యాదుకు సంబంధించిన అధికారిక పత్రం ఫోటోని కూడా జత చేసింది. ఈ సంఘటనను వివరిస్తూ ఊర్వ‌శి X లో ఇలా రాసింది.''అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నా 24 క్యారెట్ల నిజమైన బంగారు ఐఫోన్‌ను పోగొట్టుకున్నాను! ఎవరైనా దానిని చూసినట్లయితే, దయచేసి సహాయం చేయండి. వెంటనే నన్ను సంప్రదించండి'' అని కోరింది. చాలా మంది నెటిజన్లు ప్రతిస్పందించారు. కొందరు ఊర్వ‌శిని ఎగతాళి చేయగా, మరికొందరు త‌న‌కు మద్దతుగా నిలిచారు. చాలామంది ఇది ప్ర‌చార స్టంట్ అని కొట్టిపారేసారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఊర్వ‌శి ఇంత‌కుముందు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఐట‌మ్ నంబ‌ర్ లో న‌ర్తించిన సంగ‌తి తెలిసిందే. త‌దుప‌రి దిల్ హై గ్రే - బ్లాక్ రోజ్ అనే చిత్రాల్లో కనిపిస్తుంది. ఆమె జోసెఫ్ డి సామి రూపొందించ‌నున్న ప్రాజెక్ట్‌లోను కూడా న‌టించ‌నుంది. ఈ సినిమాకి టైటిల్ నిర్ణ‌యించాల్సి ఉంది.