Begin typing your search above and press return to search.

యువ హీరో సుడి తిరిగే ఛాన్స్..!

షార్ట్ ఫిలిమ్స్ తో మొదలు పెట్టి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ చిన్నగా తన స్ట్రెంగ్ పెంచుకుంటున్నాడు యువ హీరో సుహాస్

By:  Tupaki Desk   |   20 March 2024 4:00 AM GMT
యువ హీరో సుడి తిరిగే ఛాన్స్..!
X

షార్ట్ ఫిలిమ్స్ తో మొదలు పెట్టి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ చిన్నగా తన స్ట్రెంగ్ పెంచుకుంటున్నాడు యువ హీరో సుహాస్. హీరోగా కాదు నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోవలని పయత్నిస్తున్న సుహాస్. లో బడ్జెట్ లో కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు. ఈమధ్యనే అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ తో మరో సక్సెస్ అతన ఖాతాలో వేసుకున్న సుహాస్ ప్రస్తుతం చేతిలో నాలుగు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు.

ఇప్పటివరకు సుహాస్ చేసిన సినిమాలన్నీ కూడా చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించినవే.. అందులో తనతో జత కట్టే కథానాయికలు కూడా తనలా తమ ప్రతిభ చూపించాలని అనుకుంటున్నా వారే. అలాంటి సుహాస్ కి మహానటి కీర్తి సురేష్ తో నటించే ఛాన్స్ వచ్చింది. సౌత్ లో తన టాలెంట్ తో స్టార్డం కొనసాగిస్తున్న కీర్తి సురేష్ క్యారెక్టర్ బాగుంటే చాలు ఎలాంటి నటులతో అయినా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది.

ఈ క్రమంలోనే యువ హీరో సుహాస్ తో నటించేందుకు కీర్తి సురేష్ ఓకే చెప్పింది. అయితే సుహాస్ కీర్తి సురేష్ నటించే సినిమా థియేట్రికల్ మూవీ కాదని తెలుస్తుంది. అమేజాన్ ప్రైమ్ OTT కోసం చేస్తున్న సినిమా. అనీల్ ఐవి శశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఉప్పుకప్పురంబు టైటిల్ లాక్ చేశారు. ప్రైమ్ ఈవెంట్ లో ఈ సినిమా అనౌన్స్ మెంట్ చేశారు.

నిన్న మొన్నటిదాకా యువ హీరోయిన్స్ తో కలిసి నటించిన సుహాస్ ఇప్పుడు కీర్తితో కలిసి నటించడం అతని కెరీర్ కి మంచి బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు. కీర్తి సురేష్ లానే సుహాస్ కూడా తన సహజ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు. ఈ ఇద్దరు కలిసి చేసే సినిమా కచ్చితంగా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని చెప్పొచ్చు. సుహాస్ సినిమాల సెలక్షన్ లో కూడా తన స్పెషాలిటీ చూపిస్తున్నాడు. వరుస సినిమాలు చేస్తున్నా కథల విషయంలో మాత్రం ఎక్కడ రాజీ పడట్లేదని తెలుస్తుంది. ఇప్పుడు అమేజాన్ ప్రైమ్ కోసం చేస్తున్న ఈ ఉప్పు కప్పురంబు సినిమా కూడా ప్రత్యేకంగా ఉంటుందని అర్ధమవుతుంది. అంబాజీపేట ఇలా వచ్చి వెళ్లిందో లేదో ప్రసన్న వదనం అంటూ మరో కొత్త అటెంప్ట్ చేస్తున్నాడు సుహాస్. ఈమధ్యనే రిలీజైన ఈ సినిమా టీజర్ బజ్ పెంచింది.