కీర్తి, సుహాస్ సెటైరికల్ గా మెసేజ్ ఇవ్వబోతున్నారా?
సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ ను అసలు ఊహించలేం. అలాంటి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా ఉప్పు కప్పురంబు.
By: Tupaki Desk | 16 Jun 2025 7:23 AMసినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ ను అసలు ఊహించలేం. అలాంటి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా ఉప్పు కప్పురంబు. షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ను మొదలుపెట్టి, కమెడియన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుహాస్, మహానటి లాంటి గొప్ప సినిమా తీసి నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అమైజాన్ ప్రైమ్ ఓటీటీ కోసం రూపొందిస్తున్న ఈ సినిమా ఇప్పుడు స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది.
అని. ఐ. వి శశి దర్శకత్వంలో ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రై. లి. బ్యానర్ పై రాధికా లావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు వసంత్ మురళీ కృష్ణ కథ అందించారు. సెటైరికల్ కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి రోల్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని, అందుకే కీర్తి ఈ సినిమాను ఒప్పుకుందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా జులై 4 నుంచి ప్రపంచ వ్యాప్తంగా స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రైమ్ వీడియో ప్రకటించింది.
ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ తెలుగులో రిలీజ్ కానుండగా, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో డబ్బింగ్ తో ప్రసారం కానుంది. ఈ సినిమా 90స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా అని, ఉప్పు కప్పురంబు మూవీ చమత్కారం, హాస్యంతో పాటూ ఓ సామాజిక సమస్య గురించి కూడా ఇందులో చెప్పనున్నట్టు తెలిపారు. జులై 4 నుంచి ఇండియా మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 240కి పైగా దేశాల్లో ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్పెషల్ గా ప్రీమియర్ అవనున్నట్టు తెలిపారు.
ఎన్నో తాజా, పాతుకుపోయిన, సాంస్కృతిక, వైవిధ్యమైన కథలను ఆడియన్స్ కు అందించడానికి ప్రైమ్ వీడియో కట్టుబడి ఉందని, ఉప్పు కప్పురంబు సినిమా కూడా ఎంతో ఆలోచింపచేసేలా, ఆహ్లాదకరంగా, సెటైరికల్ గా ఉండనుందని, ఓ అసాధారణమైన విషయాన్ని కూడా ఈ సినిమాలో చూపించారని, కీర్తి సురేష్, సుహాస్ లాంటి వారితో వర్క్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని, డైరెక్టర్ శశి టాలెంట్ ను ఆడియన్స్ వద్దకు చేర్చడం తమకెంతో గర్వంగా ఉందని ప్రైమ్ వీడియో ఇండియన్ హెడ్ నిఖిల్ మధోక్ అన్నారు.
ఉప్పు కప్పురంబు సినిమాను తాను ఎంతో కాలంగా తెరపైకి తీసుకు రావాలనుకుంటున్నానని, 90ల నాటి గ్రామీణ జీవితం, సాధారణ ప్రజలు అసారణ పరిస్థితులను వారి స్పూర్తితో ఎలా నేవిగేట్ చేస్తారో ఈ సినిమాలో చూపించామని, సమాజంలోని చాలా తీవ్రమైన సమస్యను తాము ఈ సినిమాలో కామెడీ ద్వారా అందరికీ అర్థమయ్యేలా చూపించామని, ఈ సినిమా కోసం ప్రతీ ఒక్కరం ఎంతో నిజాయితీగా పని చేశామని, ప్రైమ్ వీడియాలో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని తాను ఆసక్తిగా ఉన్నట్టు డైరెక్టర్ శశి తెలిపారు.