Begin typing your search above and press return to search.

ఉప్పీ 'చీప్' సాంగ్.. ఏంటా పదాలు?

ఉపేంద్ర, ఏ లాంటి పలు సినిమాలతో ఆయన సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.

By:  Tupaki Desk   |   14 Feb 2024 11:01 AM GMT
ఉప్పీ చీప్ సాంగ్.. ఏంటా పదాలు?
X

ఉపేంద్ర.. ఈ కన్నడ హీరో పేరు వింటేనే ఒక్కసారిగా బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. ఎప్పుడూ చూడని, వినని డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో వసూళ్ల మోత మోగించడం ఆయనకు అలవాటే! వైవిధ్యమైన చిత్రాలతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు కొల్లగొట్టడంతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంటారు. ఒక యాక్టర్గా ఎంత ఫేమసో.. డైరెక్టర్ గా ఉపేంద్ర అంత కంటే ఫేమస్ అనే చెప్పాలి.

ఉపేంద్ర, ఏ లాంటి పలు సినిమాలతో ఆయన సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కన్నడతో పాటు తెలుగులోనూ ఆయన సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఫేమస్ అయిన అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి క్యారెక్టర్లను ఎప్పుడో చేసి చూపించారు ఉపేంద్ర‌. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యుఐ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్లింప్స్ ఇప్పటికే విడుదలైంది.

అయితే గ్లింప్స్ లో మేకర్స్ ఏం చెప్పాలానుకున్నారో ఎవరికీ పెద్దగా అర్థం కాలేదు. అయినప్పటికీ డిఫరెంట్ టైటిల్ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించింది. చిన్న గ్లింప్స్తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన ఈ ఫిల్మ్ నుంచి తాజాగా ఒక మెంటల్ మాస్ సాంగ్ బయటకు వచ్చింది. ఫిబ్రవరి 26న రిలీజ్ కానున్న 'చీప్' లిరికల్ సాంగ్ ప్రోమోను మేకర్స్ బుధవారం రిలీజ్ చేశారు.

ఈ పాట వింటుంటే నిజంగానే చీప్ సాంగ్ లా అనిపిస్తోంది! నీకంటే నాది పెద్దది, వాడికంటే నీది చిన్నది అంటూ బూతు పాట మాదిరిగా కనిపిస్తోంది. ఈ పాటను రాంబాబు గోసాల రాశారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. మొత్తంగా ఈ పాట ఏదో డబుల్ మీనింగ్ తరహాలో వినిపిస్తోంది. చీప్ అంటూనే చివర్లో కాస్ట్లీ అంటూ ఇచ్చిన ఫినిషింగ్ టచ్ వెరైటీగా అనిపిస్తోంది.

ఈ పాట ప్రోమో విని చాలా మంది మళ్లీ పాత ఉపేంద్ర గుర్తుకు వస్తున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చీప్ సాంగ్ లిరిక్స్ మాత్రం తేడాగా ఉన్నాయంటున్నారు. అయితే, పూర్తి పాట వినకముందే ఓ అభిప్రాయానికి రావడం మంచిది కాదంటున్నారు. ఈ సినిమా మామూలుగా ఉండదంటున్నారు ఆయన అభిమానులు. ఇప్పటికే ఉపేంద్ర కూడా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ సినిమా చూశాక, ప్రేక్షకులు షాక్ కు గురయ్యే అవకాశం ఉందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇంకా ఫిక్స్ చేయలేదు. పాన్ ఇండియా రేంజ్ లో ఒకేసారి విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌ తో తెర‌కెక్కిస్తున్నారు. వర్చువల్ రియాలిటీ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుందని తెలుస్తోంది. ఉపేంద్రతో పాటు సన్నీ లియోన్, మురళీ శర్మ, నిధి సుబ్బయ్య, ఇంద్రజిత్ లంకేశ్, మురళీ కృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.