Begin typing your search above and press return to search.

ఉపేంద్ర రూటే సెపరేట్..

అయితే తాజాగా ఈ చిత్ర టీజర్ లాంఛ్​ అప్డేట్​ గురించి వెరైటీగా ఇచ్చారు. ఈ వీడియోతే ఉపేంద్ర తన మార్క్​ను మళ్లీ చూపించారు.

By:  Tupaki Desk   |   11 Sep 2023 4:18 PM GMT
ఉపేంద్ర రూటే సెపరేట్..
X

కన్నడంతో పాటు తెలుగులోనూ గుర్తింపు పొందిన రియల్‌ స్టార్‌ హీరో ఉపేంద్ర. విభిన్న కథలతో అభిమానులను అలరించడం ఆయన నైజం. నలుగురు నడచిన బాటలో కాకుండా, తనదైన పంథాలో నడుస్తూ.. నలుగురినీ మెప్పించగలిగే నటదర్శకరచయితాయన. ఆయనే ఉపేంద్ర. 'కేజీయఫ్​' సిరీస్​ 'కాంతార' లాంటి చిత్రాలతో ఇప్పుడు ఇండియా వైడ్​ ప్రేక్షకులంతా ఆ పరిశ్రమ వైపు, అక్కడి నటులవైపు చూస్తున్నారు కానీ.. ఒకప్పుడే ఆ ఇండస్ట్రీలో తన సినిమాలతో ఓ గుర్తింపు పొందారు ఉపేంద్ర.

డొంక తిరుగుడు లేకుండా, ముక్కుసూటిగా మాట్లాడటం ఉపేంద్ర నైజం. అదే ఆయన సినిమాల్లోనూ కనిపించేది. తన విలక్షణ యాక్టింగ్​, డిఫరెంట్ కాన్సెప్ట్​ కథలతో ఓ ప్రత్యేకతను చాటుకున్నారాయన. దర్శకుడిగా, నటుడిగా.. 'ఓం' 'సూపర్', 'రక్త కన్నీరు, 'రా', 'శ్రీమతి', 'ఉపేంద్ర', 'కల్పనా'.. ఎన్నో సూపర్​ చిత్రాలు చేశారు. అందుకే ఆయన సినిమా అంటే ఏదో వెరైటీ ఉంటుందని అంతా ఆశిస్తుంటారు. అయితే ఆయన నటిడిగా మరింత బిజీ అయ్యాక దర్శకత్వం వహించడం మానేశారు.

గత రెండు దశాబ్దాలో ఆయన కేవలం నాలుగు, ఐదు చిత్రాలు మాత్రమే దర్శకత్వం వహించారు. 'సూపర్'​, 'కటారి వీర సురసుందరాంగి', 'టోపీవాలా', 'ఉప్పి 2' మాత్రమే చేశారు. చివరిసారిగా 2015లో 'ఉప్పి 2' చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే మళ్లీ చాలా కాలం తర్వాత ఆయన మళ్లీ మెగా ఫోన్ పట్టారు. ఆయన స్వీయ దర్శకత్వంలో 'యుఐ' అనే సినిమా రాబోతుంది.

ఈ సినిమా చడీచప్పుడు లేకుండా షూటింగ్ కూడా పూర్తి చేసేసుకుంది. కానీ ఇప్పటివరకు ఓ అప్డేట్ కూడా రాలేదు. అయితే తాజాగా ఈ చిత్ర టీజర్ లాంఛ్​ అప్డేట్​ గురించి వెరైటీగా ఇచ్చారు. ఈ వీడియోతే ఉపేంద్ర తన మార్క్​ను మళ్లీ చూపించారు.

ఈ వీడియోలో ఉపేంద్ర ఇంటి ముందు కొంతమంది అభిమానులు టీజర్, ట్రైలర్​ కావాలని గొడవ చేయడం.. దీంతో ఉపేంద్ర బయటికి వచ్చి నేరుగా బిగ్ స్క్రీన్ మీద తలెత్తి సినిమా చూడండి, మధ్యలో తలదించుకుని మొబైల్లో ప్రోమో చూడటం ఎందుకు అని అనడం.. చివరికి అభిమానుల ఒత్తిడికి ఒప్పుకున్న ఉపేంద్ర టీజర్ అప్‌డేట్ ఇవ్వడం.. వంటివి చక్కగా చూపించారు.

ఇది చూసిన ఇతర అభిమానులు.. సినిమా ప్రచార చిత్రం గురించి అప్డేట్ ఇవ్వడంలో ఉపేంద్ర మార్కు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. చూడాలి మరి చాలా గ్యాప్ తర్వాత డైరెక్షన్ చేస్తున్న ఉప్పి.. ఈ సారి ఎలా ప్రేక్షకుల ముందుకు వస్తారో..