Begin typing your search above and press return to search.

తెలుగు ఫ్యాన్స్ కోసం ఉపేంద్ర ఏం చేశాడంటే..!

కన్నడ స్టార్‌ ఉపేంద్ర ఈ మధ్య కాలంలో కాస్త స్లో అయ్యాడు కానీ పదేళ్ల క్రితం ఆయన సినిమాల జోరు, సందడి ఏ స్థాయిలో ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

By:  Tupaki Desk   |   9 Feb 2024 5:30 AM GMT
తెలుగు ఫ్యాన్స్ కోసం ఉపేంద్ర ఏం చేశాడంటే..!
X

కన్నడ స్టార్‌ ఉపేంద్ర ఈ మధ్య కాలంలో కాస్త స్లో అయ్యాడు కానీ పదేళ్ల క్రితం ఆయన సినిమాల జోరు, సందడి ఏ స్థాయిలో ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యానిమల్‌ సినిమాలోని హీరో తరహా పాత్రలను కూడా అప్పట్లోనే ఉపేంద్ర చేసిన విషయం తెల్సిందే.

తెలుగు ప్రేక్షకులకు డబ్బింగ్ సినిమాలు మరియు డైరెక్ట్‌ సినిమాలతో ఉపేంద్ర అభిమాన హీరో అయ్యాడు. ఉపేంద్ర స్టైల్‌ మరియు ఆయన సినిమాలను చాలా మంది ఇష్టపడుతారు. ఒకప్పుడు ఉపేంద్ర దర్శకత్వంలో పలు సినిమాలు వచ్చాయి. కానీ మధ్యలో దర్శకత్వంకు దూరంగా ఉండటం వల్ల ఆయన మార్క్ సినిమాలను ప్రేక్షకులు మిస్ అయ్యారు.

ఎట్టకేలకు ఉపేంద్ర దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది. 'యూఐ' అనే టైటిల్ తో ఒక భారీ సినిమాను ఉపేంద్ర రూపొందించడం జరిగింది. ఈ సినిమా కోసం ఆయన కన్నడ ఫ్యాన్స్ తో పాటు తెలుగు ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా టీజర్ కు అక్కడ ఇక్కడ మంచి స్పందన దక్కింది.

ఉపేంద్ర కన్నడ సినిమాలు తెలుగు లో డబ్‌ అయితే ఇతరులు డబ్బింగ్ చెప్తారు. కానీ 'యూఐ' సినిమా తెలుగు వర్షన్ కోసం స్వయంగా ఉపేంద్ర డబ్బింగ్‌ చెప్పాలని నిర్ణయించుకున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తానే డబ్బింగ్‌ చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశ్యంతో ఉపేంద్ర ఈ నిర్ణయం తీసుకున్నారట.

చాలా కాలం తర్వాత ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. త్వరలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఉపేంద్ర ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.