కన్నడ స్టార్ ఇక్కడ అక్కడ బిజీ బిజీ..!
సో కన్నడలో సోలో సినిమాలు చేస్తూనే మరోపక్క తెలుగు, తమిళ్ లో తన దాకా వచ్చిన సపోర్టింగ్ రోల్స్ లో మెప్పించాలని చూస్తున్నాడు ఉపేంద్ర.
By: Tupaki Desk | 18 May 2025 8:15 AM ISTకన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఈమధ్య మళ్లీ తన దూకుడు పెంచారని చెప్పొచ్చు. UI సినిమాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేసిన ఉపేంద్ర త్వరలో మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ తో రాబోతున్నారు. ఓ పక్క హీరోగా చేస్తూ మరోపక్క సపోర్టింగ్ రోల్ అది కూడా సినిమాలో ఇంపార్టెంట్ అనుకుంటే ఎలాంటి మొహమాటాలు లేకుండా చేస్తారు ఉపేంద్ర. ఈ క్రమంలో ఉపేంద్ర ప్రస్తుతం అటు తమిళ్ ఇటు తెలుగు రెండు క్రెజీ సినిమాల్లో వెరైటీ రోల్స్ చేస్తున్నారు. తెలుగులో రామ్ హీరోగా చేస్తున్న ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో ఉపేంద్ర కటౌట్ కనిపించింది. అంటే సినిమాలో ఆయన రోల్ కూడా ఉంటుందనే టాక్ వినిపిస్తుంది.
ఆంధ్రా కింగ్ తాలూకా లో ఉపేంద్ర ఉన్నాడా లేడా అన్నది త్వరలో తెలుస్తుంది. ఈ సినిమాతో రామ్ ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇదిలా ఉంటే మరోపక్క ఉపేంద్ర అటు తమిళ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా చేస్తున్న కూలీ సినిమాలో కూడా ఒక సర్ ప్రైజ్ రోల్ లో కనిపించనున్నారు . లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న కూలీ సినిమాలో ఉపేంద్ర రోల్ అదిరిపోతుందని అంటున్నారు.
సో కన్నడలో సోలో సినిమాలు చేస్తూనే మరోపక్క తెలుగు, తమిళ్ లో తన దాకా వచ్చిన సపోర్టింగ్ రోల్స్ లో మెప్పించాలని చూస్తున్నాడు ఉపేంద్ర. తెలుగులో అయితే ఉపేంద్ర త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించారు. ఆ సినిమాలో ఆ రోల్ కి ఆయనే పర్ఫెక్ట్ అనేలా చేశారు . ఇక ఇప్పుడు రామ్ తో ఆంధ్రా కింగ్ తాలూకాతో పాటు అటు రజినీ కూలీలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు .
ఈ సినిమాలతో మరోసారి సౌత్ ఆడియన్స్ ని ఆకట్టుకోనున్నారు ఉపేంద్ర. ఇక కన్నడలో ఆల్రెడీ ఆయన చేస్తున్న బుద్దివంత, త్రిశూలం తో పాటు 45వ సినిమా కూడా సెట్స్ మీద ఉన్నాయి. ఈ సినిమాలతో మరోసారి ఉపేంద్ర తన వర్సటాలిటీ చూపించాలని చూస్తున్నారు. సౌత్ లో ఉన్న డ్యాషింగ్ యాక్టర్స్ లో ఉపేంద్ర ఒకరు. ఆయనకు తగిన పాత్ర పడితే మాత్రం రఫ్ఫాడించేస్తాడు. సోలోగానే కాదు చిన్న రోల్ చేసినా దానికి పర్ఫెక్ట్ ఇంపాక్ట్ కలిగేలా చేస్తాడు ఉపేంద్ర. మరి రాబోతున్న ఈ సినిమాలతో ఉపేంద్ర ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటారన్నది చూడాలి.
