Begin typing your search above and press return to search.

ఆంధ్ర కింగ్ వచ్చేశాడు!

రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ "ఆంధ్ర కింగ్ తాలూకా" ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

By:  Tupaki Desk   |   24 May 2025 6:07 PM IST
ఆంధ్ర కింగ్ వచ్చేశాడు!
X

రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ "ఆంధ్ర కింగ్ తాలూకా" ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ స్థాయిలో రూపొందుతోంది. రామ్ పుట్టినరోజున విడుదలైన టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే యూత్‌ను ఉర్రూతలూగిస్తుండగా, అందులో కనిపించిన ‘సినిమా లవర్’ క్యారెక్టర్‌ను ప్రేక్షకులు బాగానే రిసివ్ చేసుకున్నారు.

అయితే గ్లింప్స్‌లో కనిపించకపోయినా, స్టార్ హీరో ఉపేంద్ర కటౌట్ మాత్రం పెద్ద హైలైట్‌గా నిలిచింది. తాజాగా ఉపేంద్ర హైదరాబాద్ షెడ్యూల్‌లో షూటింగ్‌కు జాయిన్ అవడం చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సూర్య కుమార్ అనే సూపర్‌స్టార్ పాత్రలో కనిపించనున్న ఉపేంద్ర రామ్ పాత్రకు ప్రధానంగా డ్రైవింగ్ ఫోర్స్‌గా మారనున్నాడు. ఈ పాత్ర కోసం ఉపేంద్ర ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు సమాచారం.

పాత్రకు ఇచ్చే ప్రాధాన్యతతో పాటు, ఈ చిత్ర కథలో ఉన్న ట్విస్ట్ లు కూడా ఆయనను అంగీకరింపజేశాయని సమాచారం. ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకునే ఉపేంద్ర, “ఆంధ్ర కింగ్ తాలూకా”లో మరోసారి తన విలక్షణతను ప్రదర్శించనున్నారు. ఈ సినిమాలో రామ్ సరసన భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటిస్తోంది. మొదటిసారి తెలుగులో అడుగుపెడుతున్న భవ్యశ్రీ ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందనుందన్న అంచనాలున్నాయి.

అలాగే రావు రమేశ్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ వంటి సీనియర్ నటుల భారీ బృందం ఈ చిత్రంలో ఉన్నారు. ప్రతీ పాత్రకు ప్రత్యేకత ఉండేలా దర్శకుడు మహేష్ బాబు పి కథ, స్క్రీన్‌ప్లే రూపొందించినట్లు సమాచారం. సాంకేతికంగా కూడా ఈ చిత్రం భారీ బలాన్ని కలిగి ఉంది. సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీ అందించగా, సంగీతాన్ని వివేక్-మెర్విన్ అందిస్తున్నారు. జాతీయ అవార్డు విజేత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు.

అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో పాటు టీ-సిరీస్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేస్తుండడం విశేషం. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రామ్ పాత్రలో నెవ్వర్ బిఫోర్ అనేలా క్లాస్ అండ్ మాస్ షెడ్స్ ఉంటాయట. అలాగే ఉపేంద్ర క్యారేక్టర్ సినిమాకు మరో బలాన్ని కలిగిస్తుందని టాక్. ఇక ఈ స్టార్స్ రేంజ్ ను మిక్స్ చేస్తూ దర్శకుడు చూపించబోయే కథనం ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ ప్రేక్షకులను థియేటర్ దాకా లాగించేలా ఉంది.