RAPO22 సూర్య కుమార్: అందనివాడు.. అందరివాడు!
ఇక ఇందులో మరో సెన్సేషన్ పాత్రగా కన్నడ స్టార్ ఉపేంద్ర ఎంట్రీ ఇస్తుండడం మరింత ఆసక్తికరంగా మారింది.
By: Tupaki Desk | 12 May 2025 11:15 AMఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ సెట్ చేసుకున్న యువ హీరో రామ్ పోతినేని ప్రతీ సినిమాలో కూడా కొత్తగా కనిపిస్తున్నాడు. ఇక ఇప్పుడు కెరీర్లో పూర్తిగా విభిన్నంగా ఉండే ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. RAPO22 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో మంచి పేరు తెచ్చుకున్న మహేష్ ఇప్పుడు రామ్ ను ఒక కొత్త యాంగిల్లో ప్రజెంట్ చేయడానికి రెడీ అయ్యాడు.
మైత్రీ మూవీ మేకర్స్ భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. ఈమె కూడా ప్రత్యేకతను తీసుకొచ్చే పాత్రలో కనిపించనుంది. ఇక ఇందులో మరో సెన్సేషన్ పాత్రగా కన్నడ స్టార్ ఉపేంద్ర ఎంట్రీ ఇస్తుండడం మరింత ఆసక్తికరంగా మారింది.
‘సూర్య కుమార్’ అనే పాత్రలో ఉపేంద్ర కనిపించనుండగా, విడుదల చేసిన పోస్టర్లో ఆయన హై వోల్టేజ్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. మీడియా లైట్స్ మధ్య ఫోటోగ్రాఫర్ల మధ్య నిలబడి ఉండే స్టైల్ చూసి, ఇది ఓ లెజెండరీ పాత్ర అని అర్థమవుతోంది. అందనివాడు.. అందరివాడు.. అనే ట్యాగ్ చూస్తుంటే పాజిటివ్ గా ఉండేలా అనిపిస్తోంది.
ఈ నెల 15న టైటిల్ గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే పోస్టర్‌కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే టైటిల్ వీడియోకి మరింత భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ పోతినేని ఈ సినిమాతో పూర్తిగా భిన్నమైన పాత్రలో దర్శనమివ్వనున్నారు. అతని లుక్, బాడీ లాంగ్వేజ్, నటన అన్నీ కొత్తగా ఉండబోతున్నాయి.
ఈ సినిమాకి సాంకేతికంగా కూడా చాలా బలమైన టీమ్ ఉంది. కెమెరామెన్‌గా సిద్ధార్థ నుని, సంగీతం కోసం వివేక్ మెర్విన్ లాంటి క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేస్తుండగా, నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా పనిచేస్తున్నారు. ఈ బ్యాకింగ్ చూస్తేనే సినిమా అట్టహాసంగా రూపొందుతుందన్న విషయం అర్థమవుతోంది. ఓ వైపు మాస్ యాక్షన్, మరోవైపు ఎమోషనల్ టచ్‌తో రాబోతున్న #RAPO22, సౌండ్, విజువల్స్, స్టోరీ పరంగా చాలా కొత్తగా ఉండనున్నట్లు అర్ధమవుతుంది.