అర్దరాత్రి అభిమాని వచ్చినా నిద్రలేపే గొప్ప తండ్రి!
కొందరు స్టార్ హీరోలు అభిమానులంటే ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. స్టేజ్ మీద హీరోలంతా అభిమానుల్ని ఉద్దేశించి ఒకేలా మాట్లాడుతారు.
By: Tupaki Desk | 29 Nov 2025 1:58 PM ISTకొందరు స్టార్ హీరోలు అభిమానులంటే ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. స్టేజ్ మీద హీరోలంతా అభిమానుల్ని ఉద్దేశించి ఒకేలా మాట్లాడుతారు. కానీ నిజాయితీగల అభిమానం కొందరే చూపించగలరు. అడిగిన వెంటనే హగ్ లివ్వడం. .సెల్పీలు ఇవ్వడం....నెల రోజుల్లో ఓ రోజు అభిమానుల కోసం కేటాయించడం...సోషల్ మీడియా ద్వారా అభిమా నులకు టచ్లోకి రావడం...వారితో చాటింగ్ చేయడం వంటివి అందరూ చేయలేరు. అది కొందరికే సాధ్యం. బాలీవుడ్ లో అమితాబచ్చన్ అభిమానులకు ఓ రోజు ఫోటో సెషన్ కోసం కేటాయిస్తారు.
వచ్చిన ప్రతీ అభిమానిని తన పక్కను నుంచో పెట్టుకుని ఫోటో ఇచ్చి పంపిస్తారు. ఇలా కొన్నేళ్లగా అమితాబ్ చేస్తున్నారు. ఇలా అభిమానం చూపించే స్టార్లు ఇంకొంత మంది ఉన్నారు. వాళ్లలో కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా ఒకరు. ప్రతీ ఆదివారం ఉపేంద్ర అభిమానులతో ఫోటోలు దిగుతాడు. సోమవారం నుంచి శనివారం వరకూ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటాడు. ఆదివారం మాత్రం అభిమానులకు సమయం ఇస్తాడు. తనని కలవడానికి వచ్చిన అభిమానులతో ఇంటరాక్ట్ అవుతాడు. వీలైనంత వరకూ ఆరోజును మాత్రం స్కిప్ కొట్టడు.
ఎన్ని పనులున్నా? సరే అభిమానుల్ని నిర్లక్షం చేయకుండా ఫోటోలిచ్చే మరో స్టార్ గా ఉపేంద్రగా ఉన్నాడు. అయితే ఉపేంద్ర తండ్రి ఆయన కన్నా? గొప్ప వ్యక్తిత్వం గల వారు అని తెలుస్తోంది. ఉపేంద్ర తండ్రి ఎవరైనా అభిమాని వస్తే ఉపేంద్రని అర్దరాత్రి అని కూడా చూడకుండా ఎవరో వచ్చారు చూడు అని నిద్ర లేపుతారుట.
ఆ అభిమానిని ఇంటి లోపలికి పిలిచి హాలులో కూర్చెబట్టి ఉపేంద్ర వద్దకు వస్తారుట. ఆ సమయంలో ఉపేంద్ర ఎలా ఉన్నా? వాళ్ల నాన్న పట్టించుకోరుట. చేయి పట్టుకుని లాక్కుని వచ్చేస్తారుట.
ఆ సమయంలో ఉపేంద్ర కాస్త అసహనానికి గురైనా కాసేపటికి కూల్ అవుతానన్నాడు ఉపేంద్ర. అర్దరాత్రి కూడా ఫోటోలిచ్చిన సందర్భాలెన్నో. గర్వం తలకెక్క కూడదు అన్నది తన తండ్రి మాటగా చెప్పారు. ఆ మాట తన తండ్రి చెప్పడంతో తలకెక్కించుకున్నానని..ఇప్పటికీ ఆ మాట ప్రకారమే నడుచుకుంటానన్నాడు. అభిమానులు ఎంతో దూరం నుంచి తనని కలవడానికి వస్తారని వాళ్లతో ఒక్క ఫోటొ దిగి ..రెండు నిమిషాలు మాట్లాడితే ఎంతో సంతోషంగా ఫీలవుతారన్నాడు ఉప్పీ. ఉపేంద్ర నటించిన తాజా సినిమా `ఆంధ్రాకింగ్ తాలూకా` నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈసినిమా మంచి విజయం సాధించినట్లు టాక్ వినిపిస్తోంది.
