ప్రేక్షకులపైనే ఉపేంద్ర ప్రయోగం
కన్నడ స్టార్ హీరో, పాపులర్ డైరెక్టర్ ఉపేంద్ర విలక్షణ శైలిని అటు కర్నాటక ప్రజలతో పాటు, తెలుగు ప్రజలు కూడా ఎంతో ఇష్టపడతారు.
By: Tupaki Desk | 29 May 2025 9:10 AM ISTకన్నడ స్టార్ హీరో, పాపులర్ డైరెక్టర్ ఉపేంద్ర విలక్షణ శైలిని అటు కర్నాటక ప్రజలతో పాటు, తెలుగు ప్రజలు కూడా ఎంతో ఇష్టపడతారు. రొటీన్ కంటెంట్ తో కాకుండా, రా అండ్ రస్టిక్ ట్రూ క్యారెక్టర్లతో సినిమాని రక్తి కట్టించడంలో అతడు స్పెషలిస్ట్. ఉపేంద్ర నటించి దర్శకత్వం వహించిన సినిమాల సరళి పూర్తి వైవిధ్యంతో అందరినీ మెప్పించాయి. `సూపర్` లాంటి పాన్ ఇండియన్ సినిమాని దశాబ్ధాల క్రితమే తీసాడు ఉపేంద్ర. అతడి క్రియేటివిటీకి తెలుగు దర్శకుల్లోను అభిమానులు ఉన్నారు.
ఇప్పుడు అతడు తనకు సినీరంగంలో డైలాగ్ రైటర్ గా అవకాశం కల్పించిన యాక్షన్ కింగ్ అర్జున్ పై ప్రశంసలు కురిసించారు. అర్జున్ దర్శకత్వం వహించిన `సీతా పయనం` ప్రమోషనల్ కార్యక్రమంలో ఉపేంద్ర మాట్లాడుతూ.. అభిమానుల కోలాహాలం నడుమ, ఆంధ్రా కింగ్ నేను కాదు.. మీలో చాలా మంది ఉన్నారు! అని అన్నారు. మీరు పిచ్చిగా సినిమా తీస్తారని అంటారు.. ఈసారి ఆడియెన్ ని ఎలివేట్ చేసే సినిమా తీస్తాను.. నేను మిమ్మల్ని (ఆడియెన్ వైపు చూపిస్తూ) హీరోగా చూడటానికి ఒక మూవీ ప్రయత్నిస్తాను.. అని ఉపేంద్ర వ్యాఖ్యానించారు.
నా స్కూల్ టైమ్ లో యాక్షన్ కింగ్ అంటే కర్నాటకలో అర్జున్ సర్. అప్పట్లో పెద్ద హిట్లు ఇచ్చారు. బ్రూస్ లీ వచ్చిన సమయంలో ఇండియాలో అర్జున్ గారు ఆయనలా పెద్ద యాక్షన్ స్టార్. కన్నడలో ఆరంభమే రెండు బ్లాక్ బస్టర్లు ఇచ్చి, తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ తీసుకున్నారు. తర్వాత తమిళంలో పెద్ద యాక్షన్ సినిమా తీసారు. నాకు అప్పట్లోనే తన సినిమాలో డైలాగ్ రైటర్ గా అవకాశం కల్పించారు. ఆయన నా స్ఫూర్తి. అప్పుడు నాకు అవకాశమిచ్చిన అర్జున్ సర్ ఇప్పుడు నా అన్నయ్య కొడుక్కి అవకాశం కల్పించారు అని తెలిపారు. అలాగే వేదికపై ముఖ్య అతిథిగా విచ్చేసిన సుకుమార్ గురించి మాట్లాడుతూ.. అద్భుత పాయింట్ తో కమర్షియల్ గా సినిమా తీసి బ్లాక్ బస్టర్లు కొట్టడమెలాగో చూపించారు.. సుకుమార్ తగ్గేదేలే అని నిరూపించారు.. అని పుష్ప డైలాగ్ తో ఉపేంద్ర రంజింపజేసారు.
సీతా పయనం సినిమా గురించి ఉపేంద్ర మాట్లాడారు. ఈ చిత్రంలో ప్రేమకథ అద్భుతంగా ఉంటుంది. ఇందులో ధ్రువ ఎంట్రీ, అదే సమయంలో అర్జున్ సర్ ఎంట్రీ ఎంతో ఆకట్టుకుంటాయని కూడా తెలిపారు. అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య, ఉపేంద్ర సోదరుడి కుమారుడు నిరంజన్ కథానాయకుడిగా నటించారు.
