Begin typing your search above and press return to search.

VD 12 : బ్యాడ్‌ న్యూస్.. ఆ వార్త నిజం కాదట

తాజాగా VD 12 చిత్ర నిర్మాత నాగ వంశీ హీరోయిన్‌ విషయం లో వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చాడు. హీరోయిన్‌ మార్పు అనేది నూరు శాతం అబద్దం. అసలు ఆ ఆలోచనే లేదు.

By:  Tupaki Desk   |   3 Oct 2023 8:30 AM GMT
VD 12 : బ్యాడ్‌ న్యూస్.. ఆ వార్త నిజం కాదట
X

విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ లో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ గత చిత్రం ఖుషి కి మంచి టాక్ రావడంతో పాటు డీసెంట్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి. దాంతో విజయ్‌ దేవరకొండ జోష్ మీదున్నాడు.

ఈ సమయంలో విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్న కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి. సితార వారు దాదాపు వంద కోట్ల బడ్జెట్‌ తో రూపొందిస్తున్న ఈ సినిమా లో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తున్న విషయం తెల్సిందే.

గత రెండు రోజులుగా విజయ్ దేవరకొండ, గౌతమ్‌ తిన్ననూరి కాంబో మూవీ హీరోయిన్‌ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. శ్రీలీల బిజీగా ఉండటం వల్ల ఆమెకు ఈ సినిమా కోసం డేట్లు ఇచ్చేందుకు వీలు పడటం లేదని, అందుకే ఆమె స్థానంలో పుష్ప ఫేం శ్రీవల్లి రష్మిక మందన్నా ని తీసుకు రాబోతున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.

విజయ్‌ దేవరకొండ, రష్మిక జోడీకి పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారు. గీత గోవిందం మరియు డియర్ కామ్రేడ్‌ సినిమాలను ఇంకా కూడా అభిమానిస్తున్న ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. ఇద్దరు ప్రేమలో ఉన్నారని... పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్న వారు చాలా మందే ఉన్నారు. వారంతా కూడా మూడో సారి ఈ జంటను వెండి తెరపై చూడాలని ఆశ పడుతున్నారు.

తాజాగా VD 12 చిత్ర నిర్మాత నాగ వంశీ హీరోయిన్‌ విషయం లో వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చాడు. హీరోయిన్‌ మార్పు అనేది నూరు శాతం అబద్దం. అసలు ఆ ఆలోచనే లేదు. శ్రీ లీల తమ సినిమాలో హీరోయిన్‌ గా నటిస్తుంది అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. విజయ్ దేవరకొండకి జోడీగా శ్రీవల్లిని చూడబోతున్నాం. ఈ వార్త గీత గోవిందం ఫ్యాన్స్ కి బ్యాడ్‌ న్యూస్‌ అయినా చెప్పక తప్పదు. రష్మికతో రౌడీ స్టార్‌ ను మళ్లీ ఎప్పుడైనా చూస్తామేమో వెయిట్‌ చేయాల్సిందే.