Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ - బన్నీ.. స్టార్ట్ అయ్యేది అప్పుడే..

అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో మాత్రం కొంత కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది.

By:  Tupaki Desk   |   21 Sep 2023 12:30 AM GMT
త్రివిక్రమ్ - బన్నీ.. స్టార్ట్ అయ్యేది అప్పుడే..
X

సినిమా ఇండస్ట్రీలో హీరో డైరెక్టర్ కాంబినేషన్స్ కు ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో అలాంటి కాంబినేషన్స్ లిస్టు చాలా పెద్దగానే ఉంది. ఇక అల్లు అర్జున్ తనతో కనెక్ట్ అయిన ఏ దర్శకుడితో అయినా సరే మరోసారి సినిమా చేసేందుకు ఎంతో ఆసక్తిని చూపిస్తూ ఉంటాడు. అవసరమైతే తన సలహాలతో దర్శకుడు టాలెంట్ను మరింత బయటకు తీసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాడు.

సుకుమార్ ఫ్యాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ కొట్టాడు అంటే అందులో బన్నీ పాత్ర చాలా ఎక్కువగానే ఉంది. అయితే త్రివిక్రమ్ స్థాయిని కూడా మరో లెవల్ కు తీసుకువెళ్లాలని అల్లు అర్జున్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. వీరి కాంబినేషన్లో ఇప్పటికే జులాయి సన్నాఫ్ సత్యమూర్తి, అల..వైకుంఠపురములో.. మూడు సినిమాలు వచ్చాయి.

ఈ మూడు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే మరోసారి అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రాబోతుంది అని అధికారికంగా క్లారిటీ అయితే వచ్చేసింది. అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో మాత్రం కొంత కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ సందీప్ రెడ్డి తో కూడా ఓ సినిమాకు ముందే కమిట్ అయ్యాడు.

ఇక లిస్టులో మరి కొంత మంది దర్శకులు ఉన్నప్పటికీ ముందుగా అయితే సందీప్ రెడ్డి వంగ త్రివిక్రమ్ ప్రాజెక్టులను బన్నీ సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నాడు. అయితే అన్ని కుదిరితే త్రివిక్రమ్ ప్రాజెక్టును 2024 ఆగస్టు తర్వాత మొదలుపెట్టాలి అని ఆలోచనలో కూడా ఉన్నారట. ఆలోపు త్రివిక్రమ్ బౌండెడ్ స్క్రిప్టును సిద్ధం చేసుకోవాలని అనుకుంటున్నాడు.

ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నా త్రివిక్రమ్ ఈ ప్రాజెక్టును సంక్రాంతికి విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇక అల్లు అర్జున్ కోసం ఇదివరకే కథ కూడా సిద్ధమయ్యింది. ఇక పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా మళ్లీ బౌండెడ్ స్క్రిప్టివ్ సిద్ధం చేయాలి అని బన్నీ కూడా సలహాలు ఇచ్చాడు. ఇక దానికోసం మరో నాలుగు నెలల సమయం తీసుకునే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 2024లో పుష్ప 2 విడుదలైన వెంటనే ప్రాజెక్ట్ షూట్ మొదలుపెట్టాలని అనుకుంటున్నారు.