Begin typing your search above and press return to search.

సందీప్ ఫాంటసీ ఫిల్మ్ ఏమైనట్టు?

అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీ గురించి ఓ వార్త వినిపిస్తోంది. గరుడ పురాణంలో మాయమైపోయిన ఓ నాలుగు పేజీల కథే ఈ భైరవకోన అని ఆ మధ్యలో మూవీటీమ్ తెలిపింది కదా.

By:  Tupaki Desk   |   4 Nov 2023 12:29 PM GMT
సందీప్ ఫాంటసీ ఫిల్మ్ ఏమైనట్టు?
X

మంచి టాలెంట్ ఉన్న నటుడు సందీప్ కిషన్. వైవిధ్యమైన పాత్రలు, కథలు చేయాలనే తపన ఆయనలో ఎప్పుడూ ఉంటుంది. కానీ విజయాలు ఆయనతో కలిసిరావడం లేదు. గత కొద్ది కాలంగా సందీప్ చేస్తున్న సినిమాలన్నీ వరుసగా నిరాశ పరుస్తున్నాయి. ఆ మధ్య చివరిగా ఆయన చేసిన పాన్ ఇండియా మైఖేల్ ఫలితం సందీప్​ను పూర్తిగా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన సోషియో ఫాంటసీ ఊరు పేరు భైరవకోన అనే సినిమా చేస్తున్నారు.

విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. అయితే ఈ చిత్రానికి ఆ మధ్యలో గట్టిగా ప్రమోట్ చేశారు. ప్రచార చిత్రాలు కూడా విడుదల చేసి సినీ ప్రియుల్లో క్యూరియాసిటీని కూడా పెంచారు. కానీ ఇప్పుడు ఈ సినిమా పేరే కొంత కాలం నుంచి సరిగ్గా వినపడట్లేదు. ఇంకా సాలిడ్ రిలీజ్ డేట్​ను కూడా లాక్​ చేసుకోలేకపోయింది.

అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీ గురించి ఓ వార్త వినిపిస్తోంది. గరుడ పురాణంలో మాయమైపోయిన ఓ నాలుగు పేజీల కథే ఈ భైరవకోన అని ఆ మధ్యలో మూవీటీమ్ తెలిపింది కదా. ఇలాంటీ ఫాంటసీ ఎలిమెంట్స్​ను తెరపై చూపించాలంటే మంచి విజువల్ ఎఫెక్ట్స్ ఉండాలి. వీఎఫ్​ఎక్స్ వర్క్ ఉంటుంది. అయితే ఈ చిత్ర వీఎఫ్​ఎక్స్​ వర్క్​తో దర్శకుడు ఆనందంగా సంతృప్తిగా లేరని తెలిసింది. అందుకే కొన్ని సన్నివేశాలను రీవర్క్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

అందుకే ఇలా ఆలస్యం అవుతోందని అంటున్నారు. సీజీ వర్క్​ మొత్తం అనుకున్న విధంగా పూర్తైతే.. చిత్రాన్ని వచ్చే ఏడాది 2024 ఫిబ్రవరిలో మంచి స్లాట్​ చూసుకుని విడుదల చేయాలని మేకర్స్​ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.

ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్​లోనే నిర్మిస్తున్నారు. రాజేష్‌ దండా నిర్మాత. అనిల్‌ సుంకర సమర్పిస్తున్నారు. వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. కాగా, గతంలో దర్శకుడు ఆనంద్​ - సందీప్ కలిసి మాయవన్​ అనే సినిమా చేశారు. మరి వరుస ఫ్లాప్​ల్లో ఉన్న సందీప్​కు ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్​ను అందిస్తుందో చూడాలి.