Begin typing your search above and press return to search.

కేజీఎఫ్ ఫ్యాన్స్ కి అతి పెద్ద గుడ్‌ న్యూస్‌

సలార్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాకుండానే కేజీఎఫ్ 3 సినిమాను మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   14 Aug 2023 8:04 AM GMT
కేజీఎఫ్ ఫ్యాన్స్ కి అతి పెద్ద గుడ్‌ న్యూస్‌
X

కన్నడ సూపర్‌ హిట్ మూవీ ప్రాంచైజీ అయిన కేజీఎఫ్‌ నుండి మరో చాప్టర్ రావడం కన్ఫర్మ్‌ అంటూ తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ చేసిన ప్రకటన చూస్తూ ఉంటే అనిపిస్తుంది. తాజాగా కేజీఎఫ్ 2 విడుదల అయ్యి ఏడాది పూర్తి అయిన సందర్భంగా కేజీఎఫ్ 3 ఎప్పుడు ఉంటుంది అంటూ ప్రశ్నించారు. అందుకు నిర్మాణ సంస్థ హంబులే వారు స్పందిస్తూ త్వరలోనే అన్నట్లుగా సమాధానం ఇవ్వడం జరిగింది.

కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్‌ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. కేజీఎఫ్ సినిమాను ఎలా అయితే రెండు చాప్టర్‌ లుగా విడుదల చేయడం జరిగిందో అలాగే సలార్‌ సినిమాను కూడా రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్ ఇటీవలే అధికారికంగా ప్రకటించడం జరిగింది.

వచ్చే నెలలో సలార్‌ 1 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక సలార్ 2 సినిమాను వచ్చే ఏడాది లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటన వచ్చింది. ఇదే సమయంలో కేజీఎఫ్ 3 సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్తలు కన్నడ సినీ వర్గాల ద్వారా మరియు మీడియా సర్కిల్స్ ద్వారా వినిపిస్తున్నాయి.

సలార్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాకుండానే కేజీఎఫ్ 3 సినిమాను మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. కేజీఎఫ్ 2 సినిమా విడుదల కాకుండానే సలార్‌ సినిమాను దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ప్రారంభించిన విషయం తెల్సిందే. ఇప్పుడు అదే తరహా లో కేజీఎఫ్ 3 ని కూడా సలార్‌ 2 సినిమా విడుదల కాకుండానే మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సలార్‌ చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మినహా మొత్తం షూటింగ్‌ పూర్తి అయింది. పార్ట్‌ 2 షూటింగ్‌ ను కూడా ముగించడం ద్వారా కేజీఎఫ్ 3 సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ పనుల్లో దర్శకుడు బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్‌.