Begin typing your search above and press return to search.

డెవిల్ వెనుక పెద్ద కష్టమే..

అందుకే, ఆ కాలాన్ని పునర్నిర్మించడం చాలా కష్టమైన పని, దాని కోసం మూవీ టీమ్ చాలా పరిశోధనలు చేసిందట. దానికే ఎక్కువ సమయం పట్టినట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   4 Sep 2023 5:31 PM GMT
డెవిల్ వెనుక పెద్ద కష్టమే..
X

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఆయన రూటే సపరేటు.అందరు హీరోల్లా కాకుండా, కాస్త సమయం ఎక్కువ తీసుకున్నా కూడా విభిన్న కథలతోనే ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటారు. తన కెరీర్ లో ఇప్పటి వరకు ఆయన చాలా ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగాల్లో కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని ఫెయిల్ కూడా అయ్యాయి. ఫలితం ఎలా ఉన్నా, ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు కొత్త కథలు అందించాలనే ఆయన ప్రయత్నం మాత్రం ఆగదు.

రీసెంట్ గా బింబిసారతో హిట్ కొట్టారు. తర్వాత అమిగోస్ బెడిసి కొట్టినా, డెవిల్ తో మరోసారి సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. ఓ వైపు బింబిసార కథకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అది కాకుండా, డెవిల్ తో ప్రేక్షకులు ఇప్పటి వరకు చూడని కథను చూపించాలని అనుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం డెవిల్ టీజర్ విడుదల చేయగా, అది కాస్త విపరీతంగా వైరల్ గా మారింది.

అయితే, ఈ మూవీ గురించి తాజాగా ఓ ఆసక్తికర విషయం తెలిసింది. ఈ మూవీ ఇప్పుడిప్పుడు మొదలైంది కాదు, ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కోసమే రెండేళ్లు పట్టిందట. జార్జ్ రెడ్డి, మైఖేల్, రాక్షసుడు వంటి చిత్రాలకు పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ గాంధీ నడికుడికర్ ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారు. ఈ మూవీలోని సీన్స్ రియలిస్టిక్ గా ఉండాలని ఆయన అనుకున్నారట. అందుకే, ఆ కాలాన్ని పునర్నిర్మించడం చాలా కష్టమైన పని, దాని కోసం మూవీ టీమ్ చాలా పరిశోధనలు చేసిందట. దానికే ఎక్కువ సమయం పట్టినట్లు తెలుస్తోంది.

బ్రిటీష్ వారు పాలించినప్పుడు మన దేశం ఎలా ఉంది? బ్రిటీష్ వారి అభిరుచులు ఎలా ఉండేవి లాంటివి తెలుసుకోవడానికి గాంధీ లాంటి సినిమాలు చూసి ప్రేరణ పొందారట. ఈ విషయాన్ని ఆర్ట్ డైరెక్టర్ గాంధీ స్వయంగా వెల్లడించారు. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కి రెండేళ్లు పట్టిందని చెప్పారు. చాలా పుస్తకాలు చదివి కొన్ని విషయాలు తెలుసుకున్నామని చెప్పారు. ఆ కాలం నాటి వస్తువులు , ఫర్నీచర్, పెయింటింగ్స్ ఎలా ఉండేవో తెలుసుకున్నామని చెప్పారు.

భారతదేశానికి స్వాతంత్ర్యం రాక ముందు బ్రిటీష్ వారి హయాంలో వాళ్ల ఏజెంట్ గా పని చేసిన ఓ వ్యక్తి కథగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీకి నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పీరియాడిక్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఈ ఏడాదే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందట. అందుకే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నారు. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్తా మీనన్ ని ఎంపిక చేశారు.