Begin typing your search above and press return to search.

కాక పుట్టిస్తోన్న క్రేజీ రిలీజ్ లు!

అలాగే యువ హీరో న‌వీన్ చంద్ర న‌టించిన `షో టైం` కూడా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకున్న చిత్ర‌మే.

By:  Tupaki Desk   |   23 July 2025 10:05 PM IST
కాక పుట్టిస్తోన్న క్రేజీ రిలీజ్ లు!
X

దాదాపు ఓటీటీ ఎంట‌ర్ టైన్ మెంట్ కి జ‌నాలంతా అల‌వాటు ప‌డ్డారు. ఏవారం ఏ సినిమా ఓటీటీ లోకి వ‌స్తుంది? అనే టాపిక్ అంద‌రి నోట న‌డుస్తోంది. ఒక‌ప్పుడు థియేట‌ర్లో సినిమా గురించి ప్రేక్షకులు ఎలా మాట్లాడుకునే వారో? ఇప్ప‌టి త‌రం యువ‌త ఓటీటీ కంటెంట్ గురించి అలా మాట్లాడుకుంటున్నారు. ఏ రోజు ఎలాంటి సినిమా రిలీజ్ అవుతుంది? అందులో థ్రిల్లింగ్ అంశాలు ఏమున్నాయో చ‌ర్చించుకోవ‌డం ప‌రిపాటిగా మారింది. తాజాగా ఈ శుక్ర‌వారం కూడా మంచి సినిమాలు ఓటీటీ రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.

అలాగే కొన్ని వెబ్ సిరీస్ లు కూడ ఆల‌రించ‌డానికి రెడీ అవుతున్నాయి. ఓసారి ఆ వివ‌రాల్లోకి వెళ్తే... కోలీ వుడ్ స్టార్ విజ‌య్ ఆంటోనీ న‌టించిన `మార్గ‌న్` కు మంచి రివ్యూలే వ‌చ్చాయి. కానీ సినిమా జ‌నాల్లోకి తీసుకె ళ్ల‌డంలో టీమ్ విఫ‌ల‌మ‌వ్వ‌డంతో అంత‌గా రీచ్ అవ్వ‌లేదు. బేసిక్ గా విజ‌య్ సినిమాలంటే మినిమం ఉంటుంద‌నే అంచ‌నాలున్నాయి. ఈ సినిమా కూడా ఆ అంచ‌నాలను అందుకుంది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. రెగ్యుల‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రాల‌కు భిన్న‌మైన అనుభూతిని ఈసినిమా అందిస్తుంది.

అలాగే యువ హీరో న‌వీన్ చంద్ర న‌టించిన `షో టైం` కూడా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకున్న చిత్ర‌మే. కానీ క‌మ‌ర్శియ‌ల్ గా వ‌ర్కౌట్ అవ్వ‌లేదు. ఓసెక్ష‌న్ ఆడియ‌న్స్ కు బాగానే రుచించింది. న‌వీన్ ఓ మంచి అటెంప్ట్ చేసాడ‌నే ప్ర‌శంస ద‌క్కించుకున్నాడు. ఈ సినిమా సన్ నెక్స్ట్ లో చూడొచ్చు. అలాగే ఇబ్రహీం అలీఖాన్, పృధ్వీరాజ్ సుకుమార‌న్, కాజోల్ న‌టించిన `సర్జమీన్` అన్ని భాష‌ల్లోనూ జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంటుంది. ఈచిత్రాన్ని థియేట్రిక‌ల్ గా రిలీజ్ చేయాల‌నుకున్నా కుద‌ర‌క‌పోవ‌డంతో నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.

అలాగే నెట్ ఫ్లిక్స్ లో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ `మండాలా మర్డర్స్` రిలీజ్ అవుతుంది. దీనిపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ ఎంతో ఆస‌క్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇంకా భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన ‘రంగీన్’ వెబ్ సిరీస్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది. ఇదీ ఇంట్రెస్టింగ్ థ్రిల్ల‌ర్. ఇప్ప‌టికే ప్ర‌చార చిత్రాల‌తో మంచి బ‌జ్ క్రియేట్ అయింది. ఇంకా మాలీవుడ్ మూవీ` రోంత్` ఇప్ప‌టికే నెట్ ప్లిక్స్ లో అల రిస్తుంది. ఇంకా మ‌రిన్ని సినిమాలు...సిరీస్ లో రిలీజ్ అవుతున్నాయి.