'సూపర్ హీరో' చిత్రాలు.. అప్ కమింగ్ ప్రాజెక్టులు ఇవే..
సూపర్ హీరో చిత్రాలకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. సరిగ్గా హ్యాండిల్ చేస్తే కచ్చితంగా సినీ ప్రియులు ఓ రేంజ్ లో ఆదరిస్తారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
By: Tupaki Desk | 9 Jun 2025 12:59 PM ISTసూపర్ హీరో చిత్రాలకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. సరిగ్గా హ్యాండిల్ చేస్తే కచ్చితంగా సినీ ప్రియులు ఓ రేంజ్ లో ఆదరిస్తారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇప్పటికే సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన వివిధ సినిమాలు నేషనల్ వైడ్ గా కూడా హిట్స్ అయ్యాయి. ఇండియన్ మూవీ లవర్స్ ను ఆకట్టుకున్నాయి.
అయితే సూపర్ హీరో కాన్సెప్ట్ తో రూపొందుతున్న సినిమాలు ఇప్పుడు కొన్ని షూటింగ్స్ ను జరుపుకుంటున్నాయి. మరికొన్ని సెట్స్ పైకి త్వరలో వెళ్లనుండగా.. ఇంకా కొన్ని ప్రాజెక్టుల కోసం చర్చలు జరుగుతున్నాయి. అయితే సూపర్ కాన్సెప్ట్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాల గురించి ఓ సారి మనం తెలుసుకుందాం.
ముందు టాలీవుడ్ సినిమాల విషయానికొస్తే.. యంగ్ హీరో తేజ సజ్జా లీడ్ రోల్ లో డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని సూపర్ హీరో మూవీ మిరాయ్ ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు క్రియేట్ చేసుకున్న ఆ సినిమా.. సెప్టెంబర్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గా.. పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. భారీ వీఎఫ్ ఎక్స్ వర్క్ తో రూపొందనున్న ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్.
మెగాస్టార్ స్టార్ చిరంజీవి, బింబిసార ఫేమ్ వశిష్ట కాంబోలో రానున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర.. షూటింగ్ ను ఇప్పటికే కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండగా, సినిమాలో సూపర్ హీరో అంశాలు ఉన్నాయని తెలుస్తోంది. 2025 చివర్లలో మూవీ రిలీజ్ కానుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
టాలీవుడ్ లో వీటితోపాటు రవితేజ- మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ మూవీ, ప్రశాంత్ వర్మ అధీర, మహాకాళి చిత్రాలు కూడా సూపర్ హీరో కాన్సెప్ట్ తో రూపొందనున్నాయి! మరోవైపు, బాలీవుడ్ లో క్రిష్-4 సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్ లీడ్ రోల్ లో నటిస్తూనే.. దర్శకత్వం వహించనున్నారు.
బీ టౌన్ స్టార్ నటుడు అమీర్ ఖాన్ హీరోగా కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఓ సూపర్ హీరో మూవీ తీయనున్నారు. వచ్చే ఏడాది ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. శక్తిమాన్ ఫిల్మ్ అడాప్టేషన్ కూడా సూపర్ హీరో కాన్సెప్ట్ తో రానుంది. మొత్తానికి అప్ కమింగ్ సూపర్ హిట్ చిత్రాలు.. ఎలాంటి హిట్స్ అవుతాయో వేచి చూడాలి.
