టాలీవుడ్ క్రేజీ స్టార్స్ మాస్ పోలీస్ జాతర
చాలా రోజుల తరువాత మళ్లీ ఖాకీ కథలతో స్టార్ హీరోలు వరుసగా సినిమాలు చేస్తుండటంతో ఇప్పుడు అందరిదృష్టి ఆ ప్రాజెక్ట్‌లపై పడింది.
By: Tupaki Desk | 20 April 2025 6:00 AM ISTటాలీవుడ్‌కు ఖాకీ డ్రెస్‌కు చాలా అనుబంధం ఉన్నట్టుగా ఉంది. కారణం పోలీస్ స్టోరీ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో అత్యధిక శాతం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లుగా నిలిచి హీరోలకు తిరుగలేని గుర్తింపుని తెచ్చి పెట్టాయి. డా. రాజశేఖర్ `అంకుశం`, బాలయ్య రౌడీ ఇన్స్‌స్పెక్టర్, శ్రీహరి దేవా, డైలాగ్ కింగ్ సాయికుమార్ `పోలీస్‌స్టోరీ`, మాస్‌మహారాజా రవితేజ `క్రాక్`, హిట్ 1, హిట్ 2 ఇలా చెప్పుకుంటూ పోతే పవర్ ఫుల్ పోలీస్ స్టోరీలతో రూపొందిన సినిమాలు చాలానే ఉన్నాయి.
చాలా రోజుల తరువాత మళ్లీ ఖాకీ కథలతో స్టార్ హీరోలు వరుసగా సినిమాలు చేస్తుండటంతో ఇప్పుడు అందరిదృష్టి ఆ ప్రాజెక్ట్‌లపై పడింది. పోలీస్‌కథలతో నేచురల్ స్టార్ నాని, మాస్ మహారాజా రవితేజ, ప్రభాస్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వంటి క్రేజీ స్టార్స్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. నేచరల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్ ఫ్రాంఛైజీలో భాగంగా పవర్ ఫుల్ పోలీస్ స్టోరీతో చేస్తున్న మూవీ `హిట్: ద థర్డ్ కేస్`. ఇందులో అర్జున్ సర్కార్‌గా నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో కనిపించి అదరగొట్టబోతున్నాడు.
ఇటీవల విడుదలై ప్రచార చిత్రాలతో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. నాని కూడా ఈ సినిమబాతో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే బిజినెస్ పరంగానూ చర్చనీయాంశంగా మారిన `హిట్ 3` మే 1న వరల్డ్ వైడ్‌గా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇక దీని తరువాత పోలీస్ స్టోరీతో వార్తల్లో నిలిచిన హీరో మాస్ మహారాజా రవితేజ. తను నటిస్తున్న లేటెస్ట్ కాప్ డ్రామా `మాస్ జాతర`. వరుస ఫ్లాపుల్లో ఉన్న రవితేజ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారట.
శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని సితార వంశీ నిర్మిస్తున్నారు. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వీరితో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా తొలిసారి ఖాకీ డ్రెస్ ధరించి ప్రత్యుర్థులపై విరుచుకుపడబోతున్నారు. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో ప్రభాస్ నటించనున్న మూవీ `స్పిరిట్`. ఇందులో ప్రభాస్‌పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలు పూర్తయిన వెంటనే సందీప్ ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నాడు.
ఇక రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా ఫస్ట్ టైమ్ ఖాకీ డ్రెస్ ధరించి పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో దర్శనమివ్వబోతున్నాడు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా `కింగ్‌డమ్`. సితార వంశీ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాపై విజయ్ దేవరకొండ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. పవర్‌ఫుల్ పోలీస్ క్యారెక్టర్‌లో విజయ్ దేవరకొండ నటించిన ఈ మూవీ మే 30న భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. వీరి తరహాలో మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ కూడా మరో సారి పోలీస్ డ్రెస్ వేయబోతున్నాడు. ఇటీవల చేసిన సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆలోచనలో పడిన విశ్వక్ `హిట్` తరహాలో మరోసారి ఖాకీ డ్రెస్ ధరించి హిట్టుకొట్టడానికి రెడీ అవుతున్నాడట.
