Begin typing your search above and press return to search.

చరణ్ నిజ జీవితంలో బ్యాడ్ యాక్ట‌ర్ : ఉపాస‌న‌

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన జంట అన్యోన్య‌త‌, లైఫ్ స్టైల్ ఎప్పుడూ అభిమానుల్లో చ‌ర్చ‌నీయాంశ‌మే.

By:  Tupaki Desk   |   29 Dec 2023 5:06 AM GMT
చరణ్ నిజ జీవితంలో బ్యాడ్ యాక్ట‌ర్ : ఉపాస‌న‌
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన జంట అన్యోన్య‌త‌, లైఫ్ స్టైల్ ఎప్పుడూ అభిమానుల్లో చ‌ర్చ‌నీయాంశ‌మే. చ‌ర‌ణ్ కెరీర్ ప‌రుగు, బిజీ లైఫ్‌ని అర్థం చేసుకుని త‌న‌కు అన్నివిధాలా స‌హ‌క‌రించే భార్య‌గా ఉపాస‌న ఆద‌ర్శ‌ప్రాయం. చ‌ర‌ణ్ కెరీర్ ఎదుగుద‌ల‌లో ఆమె భాగ‌స్వామి. ఈ డైనమిక్ పెయిర్ ఇటీవలే ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ క‌వ‌ర్ పేజీని అలంకరించారు. మ్యాగ‌జైన్ ఇంటర్వ్యూలో సంపూర్ణ ఆరోగ్య వేదిక అయిన UR.Life వ్యవస్థాపకురాలు అపోలో హాస్పిటల్స్‌ CSR (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) వైస్ చైర్‌పర్సన్ అయిన ఉపాసన త‌న హ‌బ్బీ రామ్ చరణ్ వ్యక్తిత్వంలోని ఆసక్తికరమైన అంశాలపై ముచ్చ‌టించారు.

ఉపాసన తన కెరీర్‌పై తనకు వడపోత మరియు ప్రత్యామ్నాయ దృక్పథాన్ని అందించినందుకు చరణ్‌ని అంగీకరించింది. 'మ‌న‌కు దేనిలో అయినా రియాలిటీ చెక్ (నిజం తెలుసుకునే అవ‌కాశం) ఇవ్వడానికి ఎవరైనా కావాలి. వారు మీకు ఫిల్టర్ చేయని విషయాలు చెబుతారు.. అతడు (చ‌ర‌ణ్‌) నాకు అలాంటి వ్యక్తి. నేను త‌ను ఏం చెప్పినా నిశ్శబ్దంగా వింటాను.. నేను తిరిగి ప్రశ్నించను' అని తెలిపింది. నిజ జీవితంలో అతడు బ్యాడ్ యాక్ట‌ర్‌. అతడి మనస్సులో ఉన్న‌ది ప్రతిదీ నాకు తెలుసు! అని ఉపాస‌న అన్నారు.

తన జీవితంలోని వివిధ దశ‌ల్లో ఎదుర్కొన్న‌ చాలా విష‌ష‌యాలను ఉపాస‌న వెల్ల‌డించారు. ఉపాసన ఒక కళాశాల విద్యార్థిగా బాడీ షేమింగ్ ని ఎదుర్కొన్నాన‌ని, ఔత్సాహిక ఫ్యాషన్ డిజైనర్‌గా కుటుంబ వ్యాపారంలో చేరడానికి ఆస‌క్తి లేక‌పోయినా.. పరివర్తన చెందే ఆధ్యాత్మిక ప్రయాణం ఆమె లక్ష్యాన్ని గుర్తించేలా చేసిందని తెలిపారు. నేను ఈ ప్రపంచంలో, ఈ నేపథ్యంలో, ఈ సమయంలో, ఒక కారణం కోసం ఉన్నానని నేను అర్థం చేసుకున్నాను. నేను దానిని ఉత్తమంగా ఉపయోగించుకోకపోతే స‌రికాదు. ఇప్పుడు నా వివాహం కూడా మంచిని వ్యాప్తి చేయడానికి.. అలా చేయ‌క‌పోతే జీవితానికి అర్థం ఏం ఉంది? అని అన్నారు.