Begin typing your search above and press return to search.

మా కుటుంబంలో ఇద్దరు పద్మ విభూషణ్ లు! ఉపాసన

మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ‌విభూష‌ణ్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Jan 2024 10:41 AM GMT
మా కుటుంబంలో ఇద్దరు పద్మ విభూషణ్ లు! ఉపాసన
X

మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ‌విభూష‌ణ్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో మెగా అభిమానుల్లో.. ఆకుటుంబం ఆనందానికి అవ‌దుల్లేవ్. దేశంలో రెండ‌వ అత్యున్న‌త పౌర పుర‌స్కారం చిరంజీవికి వ‌రించ‌డంతో ఆయ‌న ఇంకా షాక్ లోనే ఉన్నారు. ఎలా స్పందించ‌లో అర్దం కాలేదంటూ చిరంజీవి సంతోషం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎంతో మంది ప్ర‌ముఖులు..అభిమానులు చిరంజీవికి విషెస్ తెలియ‌జేసారు.

తాజాగా మెగా కోడలు ఉపాసన మ‌రో ఆసక్తికర ట్వీట్ చేశారు. తమ కుటుంబంలో ఇద్దరు పద్మ విభూషణ్ లు ఉన్నారని వెల్లడించారు. ఒకరు తన తాతయ్య డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి కాగా.. మరొకరు తన మామయ్య చిరంజీవి కొణిదెల అని వివరించారు. తమ కుటుంబానికి ఇంతటి విశిష్ట గౌరవం దక్కడాన్ని ఆశీర్వచ నంలా భావిస్తున్నామని ఉపాసన పేర్కొన్నారు. అలాగే చిరంజీవి- ప్రతాప్ సి రెడ్డి క‌లిసిన ఓ ఫోటోని ఫొటోను కూడా ఆమె ఎక్స్ లో పంచుకున్నారు. ప్ర‌స్తుతం ఉపాస‌న షేర్ చేసిన విష‌యం నెట్టింట వైర‌ల్ అవుతుంది. అటు త‌ల్లి కుటుంబం నుంచి ఇటు అత్తారింటి నుంచి రెండు ప‌ద్మ విభూష‌ణ‌ల్ ఉండ‌టంతో ఉపాస‌న ఎంత సంతోషంగా ఉన్నారో ఆమె వ్యాఖ్య‌ల్ని బ‌ట్టి తెలుస్తోంది.

రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న‌లు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ పెళ్లైన త‌ర్వాత నటుడిగా మ‌రింత ఎదిగాడు. ఇప్పుడు పాన్ ఇండియాలో ఫేమ‌స్ అయిన న‌టుడు. తాజాగా మామ చిరంజీవికి ప‌ద్మ‌విభూష‌ణ్ రావ‌డంతో ఆమె ఎంతో సంతోషంగా ఉన్నారు. 1.4 బిలియ‌న్ మంది ఉన్న దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కూ 110 మందికి మాత్ర‌మే ప‌ద్మ‌విభూష‌ణ్ తో సత్కారం ద‌క్కింది. అందులో చిరంజీవి- ప్ర‌తాప్ రెడ్డి ఉన్నారు. అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాప్ సి రెడ్డికి కేంద్రం 1991లో పద్మ భూషణ్ ప్రకటిం చింది. 2010లో ఆయనకు పద్మ విభూషణ్ ప్రకటించారు. చిరంజీవి 2006లో పద్మ భూషణ్ అందుకు న్నారు.