Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్ పై ప్రేమ‌తో ఉపాస‌న ఇలా!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌-ఉప‌సాస‌నల మ‌ధ్య అన్యోన్య‌త గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Tupaki Desk   |   22 May 2024 5:33 AM GMT
చ‌ర‌ణ్ పై  ప్రేమ‌తో ఉపాస‌న ఇలా!
X

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌-ఉప‌సాస‌నల మ‌ధ్య అన్యోన్య‌త గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. చ‌ర‌ణ్ షూటింగ్ లు లేక‌పోతే ఇంట్లోనే స‌మ‌యాన్ని గ‌డుపుతాడు. బేబి క్లీంకార‌తో..భార్య ఉపాస‌న‌తో టైంపాస్ చేస్తారు. క్లీంకార నెల‌లు ఇంకా పాపాయి కావ‌డంతో వెకేష‌న్ల‌కు వెళ్ల‌లేక‌పోతున్నారు. లేదంటే కుమార్తెని ప‌ట్టుకుని అన్ని దేశాలు చుట్టేసేవారే. తాజాగా చ‌ర‌ణ్‌-ఉపాస‌న క‌లిసి ఉన్న ఓఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ అవుతోంది. అందులో దంప‌తులిద్ద‌రు అద్భుత‌మైన క‌ళ్లు చెదిరే లొకేష‌న్ ని ఆస్వాదిస్తున్నారు.


ఎదురుగా ఎత్తుగా ఉన్న నునుపైన కొండ‌లు...అక్క‌డ‌క్క‌డా ప‌చ్చ‌ని చెట్ల ర‌మ‌ణీయ‌త‌ను చ‌ర‌ణ్ ఆస్వాదించ‌గం గ‌మినించొచ్చు. చ‌ర‌ణ్ కి ఆపోజిట్ లో ఉపాస‌న న‌వ్వుతూ వాక్ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. హిల్స్ స్టేష‌న్ నుంచి క్యాప్చ‌ర్ చేసిన పిక్ లా ఉంది. ఇందులో చ‌ర‌ణ్ గోల్డ్ క‌ల‌ర్ ష‌ర్ట్, సిమెంట్ క‌ల‌ర్ ప్యాంట్ ధ‌రించారు. ఉపాస‌న వైట్ క‌ల‌ర్ ష‌ర్ట్ పై మ్యాచింగ్ సిమెంట్ రంగు ప్యాంట్ ని ధ‌రించారు. ఉపాస‌న క‌ళ్ల‌కు కూలింగ్ గ్లాసెస్ కూడా ధ‌రించారు.


ఇద్ద‌రు వెకేష‌న్ కి వెళ్లిన స‌మ‌యంలో తీసిన పిక్ లా ఉంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ ఫోటోని ఉద్దేశించి ఉపాష‌న ఆస‌క్తిక‌ర పోస్ట్ షేర్ చేసారు. జీవిత భాగ‌స్వామి నుంచి త‌న‌కు ఎన్ని ర‌కాలుగా స‌హ‌కారం ల‌భిస్తుందో చెప్పుకొచ్చే ప్రయ‌త్నం చేసారు. భ‌ర్త‌గా చ‌ర‌ణ్ స్థానం గురించి ఎంతో గొప్పగా వివ‌రించారు. ఈ సమావేశాన్ని ఇంత ప్రత్యేకంగా చేసినందుకు జీవిత భాగస్వాములందరికీ ధన్యవాదాలు తెలియ‌జేసారు.

ల‌వ్ సింబ‌ల్ కూడా జోడించారు. మెగా అభిమానుల్లో ఈపిక్ ఆస‌క్తిక‌రంగా మారింది. నిన్న మొన్న‌టివ‌ర‌కూ హైద‌రాబాద్ లోనే క‌నిపించిన జోడీ స‌డెన్ గా ఎక్క‌డికి వెళ్లారంటూ సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ హీరోగా `గేమ్ ఛేంజ‌ర్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి.