ఫైండ్ ఇట్ ఎర్లీ.. ఫైట్ ఇట్ ఎర్లీ అంటున్న ఉపాసన..!
ఇల్ నెస్ ని క్యూర్ చేయడమే కాదు దాని పట్ల అవేర్ నెస్, ఎడ్యుకేట్ చేసేలా ఈ ప్రోగ్రాం ఉంటుందని అన్నారు ఉపాసన.
By: Tupaki Desk | 12 Jun 2025 12:48 AM ISTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఎప్పటికప్పుడు తన పనులతో సర్ ప్రైజ్ చేస్తుంటారు. అపోలో హాస్పిటల్స్ సీ.ఈ.ఓగా ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మహిళల హెల్త్ కేర్ అవేర్ నెస్ కాంపెయిన్స్ చేస్తూ ఉంటారు. అంతకుముందు గెట్ ఫిట్ వెయిట్ రిడక్షన్ కాంపెయిన్ సోషల్ మీడియాలో చేశారు. అది ప్రజల్లో చాలా ఇంపాక్ట్ కలిగించింది. ఉపాసన స్ట్రిక్ట్ డైట్ రూల్స్ ని చాలామంది పాటించారు. ఇక లేటెస్ట్ గా ఉపాసన ఫ్యూజి ఫిల్మ్ ఇండియా తో కలిసి బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ ప్రోగ్రాం మొదలు పెట్టారు.
మహిళల్లో ఈమధ్య ఎక్కువ అవుతున్న బ్రెస్ట్ క్యాన్సర్ ని ముందుగా కనిపెట్టి దాని కోసం ఫైట్ చేయాలని చెబుతున్నారు ఉపాసన కొణిదెల. మొత్తం 23 సిటీస్ లో సి.ఎస్.ఆర్ బ్రెస్ట్ క్యాన్సర్ కాంపెయిన్ ని జరుపనున్నారు. దీనికి క్యాప్షన్ గా ఫైండ్ ఇట్ ఎర్లీ, ఫైట్ ఇట్ ఎర్లీ అని పెట్టారు. అంటే ముందుగా కనిపెట్టు త్వరగా ఫైట్ చేయి అని దానర్థం. రోజు రోజుకి పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్ కేసుల గురించి అవగాహన కలిగించేలా ఈ కాంపెయిన్ ఉంటుంది.
ఇల్ నెస్ ని క్యూర్ చేయడమే కాదు దాని పట్ల అవేర్ నెస్, ఎడ్యుకేట్ చేసేలా ఈ ప్రోగ్రాం ఉంటుందని అన్నారు ఉపాసన. బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల మహిళల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. వారికి సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్లే అలా జరుగుతుంది. అందుకే సి.ఎస్.ఆర్ ఇన్షియేషన్ గా తీసుకుని మహిళలకు కావాల్సిన అవగాహన కలిగిస్తారు.
అపోలో టెలిమెడిసిన్ నెట్వర్కింగ్ ఫౌండేషన్ ద్వారా దాదాపు 23 సిటీల్లో ఈ కాంపెయిన్ జరుపనున్నారు. ఈ కార్యక్రమంలో లక్ష మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన తెచ్చుకునేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఉపాసన ప్రజల్లో ఎంతో గొప్ప పేరు సంపాదిస్తుంది. మెగా కోడలుగా ఉపాసన తను చేస్తున్న మంచి పనులకు మెగా ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతున్నారు.
ఒక వ్యాపారవేత్తగానే కాదు ప్రజలకు అవసరమైన ఇన్ ఫర్మేషన్ ముఖ్యంగా హెల్త్ అవేర్ నెస్ విషయంలో ఉపాసన వేస్తున్న ప్రతి అడుగు చేస్తున్న ప్రతి కార్యక్రమం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని చెప్పొచ్చు. లేటెస్ట్ గా ఫుజి ఫిల్మ్ తో కలిసి ఉపాసన చేస్తున్న ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కాంపెయిన్ కూడా ఎంతోమంది మహిళలకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు./19
