ఉపాసన - ది రియల్ ఫ్యాషన్ గేమ్ ఛేంజర్
స్టైల్ ఐకాన్.. గేమ్ ఛేంజర్.. బాస్ లేడీ.. స్టన్నర్.. ఇలా ఎలా పిలిచినా అది ఉపాసన లేటెస్ట్ లుక్ కి సరిపోతుంది. ఉపాసన కొణిదెల ఫ్యాషన్ సెన్స్ పరంగా ఇటీవల రియల్ గేమ్ ఛేంజర్ గా మారారు.
By: Tupaki Desk | 24 May 2025 2:22 PM ISTస్టైల్ ఐకాన్.. గేమ్ ఛేంజర్.. బాస్ లేడీ.. స్టన్నర్.. ఇలా ఎలా పిలిచినా అది ఉపాసన లేటెస్ట్ లుక్ కి సరిపోతుంది. ఉపాసన కొణిదెల ఫ్యాషన్ సెన్స్ పరంగా ఇటీవల రియల్ గేమ్ ఛేంజర్ గా మారారు. ముఖ్యంగా ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ మారుతున్న ఈ లేటెస్ట్ వరల్డ్ లో ఎంపికల పరంగా నేటి జెన్ - జెడ్ కి పాఠాలు నేర్పించే రేంజులో తనను తాను ఆవిష్కరించుకుంటున్న విధానం ఆశ్చర్యపరుస్తోంది.
ఉపాసన తాజాగా స్టన్నర్ అనిపించే సూట్ లో ప్రత్యక్షమయ్యారు. ఒక వ్యవస్థాపకురాలిగా, బాధ్యతాయుతమైన భార్య స్థానంలో ఉన్న ఉపాసన ఇలా అల్ట్రా మోడ్రన్ లుక్ తో కనిపించడంతో అభిమానులు నిజంగానే స్టన్నయిపోయారు. తమ ఫేవరెట్ స్టార్ రామ్ చరణ్ సతీమణిలో ఈ ఫ్యాషన్ సెన్స్ నిజంగా ఎందరికో స్ఫూర్తి. ఉపాసన ఎక్స్ కురో బ్రాండ్ అదుర్స్ అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ డ్రెస్ ని డిజైన్ చేసింది ఆషామాషీ వ్యక్తి కాదు. సబ్యసాచి - అనామిక ఖన్నా వంటి డిజైనర్ల రూపకల్పన ఫలితమిది. ఉపాసన సొంత వార్డ్‌రోబ్ లో ఇది ఎంతో ప్రత్యేకమైన డ్రెస్.
అత్తమ్మా కిచెన్ నిర్వహణలో ఉపాసన ఇప్పటికే ఘనవిజయం సాధించింది. తాజా ఫ్యాషన్ స్టేట్ మెంట్ చూశాక ఉపాసన పై దర్శకుడు సుకుమార్ భార్య, నిహారిక కొణిదెల కూడా ప్రశంసలు కురిపించారు. డిజైనర్ లుక్స్ పరంగా ఉపాసన దేశీ ఐడియాలజీపై వీరంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆహారం, ఫ్యాషన్ బిజ్ సహా చాలా రంగాల్లో ఉపాసన చాతుర్యం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఉపాసన -ఎక్స్ కురో డిజైనర్ బ్రాండ్ తో మరోసారి తనదైన ముద్ర వేసింది. ఇది కచ్ఛితంగా నేటి జెన్ జెడ్ యూత్ కి బాగా సరిపోయే డిజైనర్ లుక్ అనడంలో సందేహం లేదు.
