పిక్ టాక్: మెగా కపుల్ న్యూ ఇయర్ విషెస్
దానికి కారణం ఉపాసన షేర్ చేసిన ఫోటోలో రామ్ చరణ్ కూడా ఉండటం.
By: Tupaki Desk | 15 April 2025 11:06 AM ISTమెగా కోడలు, రామ్ చరణ్ భార్య, అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ ఉపాసన కామినేని సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు అప్డేట్స్, తన వ్యక్తిగత అభిప్రాయాలను షేర్ చేస్తూ ఉండే ఉపాసన తాజాగా తన ఇన్‌స్టాలో చేసిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
దానికి కారణం ఉపాసన షేర్ చేసిన ఫోటోలో రామ్ చరణ్ కూడా ఉండటం. ఈ ఫోటోలో మెగా కపుల్ రామ్ చరణ్, ఉపాసన ఎంతో అందంగా కనిపిస్తున్నారు. రామ్ చరణ్ ఈ ఫోటోలో లేత గోధుమరంగు సూట్ లో ఎంతో హ్యాండ్‌సమ్ కనిపిస్తుండగా, ఉపాసన బ్లూ కలర్ ఎథ్నిక్ వేర్ లో మరింత అందంగా కనిపించింది.
సోమవారం రాత్రి ఉపాసన తన ఇన్‌స్టాలో ఈ ఫోటోను షేర్ చేస్తూ ఈ పండుగ రోజు మీకు ఆనందం, శ్రేయస్సు, కొత్త ప్రారంభాలను తీసుకురావాలని మేం కోరుకుంటున్నాం. మరాఠి, తమిళ్, అలాగే బెంగాల్ తదితర రాష్ట్రాల్లోని ప్రజలకు కొత్త ఏడాది మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చింది. ఉపాసన చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ పోస్ట్ చూసిన మెగా ఫ్యాన్స్ చరణ్ ఓ వైపు సినిమాలు చేస్తూ షూటింగుల్లో బిజీగా ఉంటూనే ఫ్యామిలీతో కలిసి మంచి టైమ్ ను స్పెండ్ చేస్తున్నాడని అతన్ని అభినందిస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా రిలీజైన పెద్ది సినిమా ఫస్ట్ షాట్ కు ఆడియన్స్ అందరి నుంచి విశేష స్పందన వచ్చింది. పెద్ది సినిమా వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
