Begin typing your search above and press return to search.

60 ఏళ్ల వయసులో 600 km.. ఉపాసన మదర్‌ రికార్డ్‌

మెగా వారి ఇంటి కోడలు ఉపాసన కొణిదెల రెగ్యులర్‌గా సోషల్‌ మీడియా ద్వారా ఏదో ఒక విషయాన్ని షేర్‌ చేస్తూ ఉంటుంది.

By:  Tupaki Desk   |   4 Jun 2025 4:00 PM IST
60 ఏళ్ల వయసులో 600 km.. ఉపాసన మదర్‌ రికార్డ్‌
X

మెగా వారి ఇంటి కోడలు ఉపాసన కొణిదెల రెగ్యులర్‌గా సోషల్‌ మీడియా ద్వారా ఏదో ఒక విషయాన్ని షేర్‌ చేస్తూ ఉంటుంది. ఆమె నుంచి వచ్చే ప్రతి పోస్ట్‌ చాలా ఆసక్తిని కలిగిస్తూ ఉంటుంది, అంతే కాకుండా ఆలోచనాత్మకంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇది.. అది అని కాకుండా అన్ని రంగాల గురించి ఆమె తన ఆలోచనలు పంచుకుంటూ షేర్ చేసే అభిప్రాయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. తాజాగా ఉపాసన కొణిదెల తన తల్లి సాధించిన అరుదైన రికార్డ్‌ను షేర్‌ చేసింది. అంతే కాకుండా ఆమె తన తల్లి అయినందుకు గర్విస్తున్నాను, ఆమె నా రాక్‌ స్టార్‌ అంటూ తల్లిపై తనకు ఉన్న ప్రేమ, గౌరవంను ఉపాసన ఈ పోస్ట్‌లో చాటుకుంది.

ప్రపంచ సైకిల్‌ డే సందర్భంగా ఉపాసన ఆసక్తికర విషయాలను షేర్ చేసింది. పెద్దగా హడావిడి లేకుండా, హంగామా లేకుండా ఉపాసన తల్లి శోభన కామినేని గారు తన హైదరాబాద్‌ నివాసం నుంచి తన తల్లిదండ్రుల చెన్నై నివాసం వరకు సైకిలింగ్ చేస్తూ వెళ్లిందట. ఈ విషయాన్ని ఉపాసన షేర్ చేయడంతో అంతా షాక్ అవుతున్నారు. హైదరాబాద్‌ నుంచి చెన్నైకి దాదాపుగా 600 కిలో మీటర్ల దూరం ఉంటుంది. సాధారణం ఇంత దూరం ను కనీసం బైక్ పై కూడా ప్రయాణించేందుకు యువతి యువకులు భయపడతారు. అలాంటిది 60 ఏళ్ల వయసులో శోభన కామినేని అంత దూరం ను సైకిల్ మీద చేరుకోవడం అనేది కచ్చితంగా రికార్డ్‌గా చెప్పుకోవచ్చు.

మొకాలికి ఆపరేషన్‌ అయినప్పటికీ, నెక్‌లో ప్లేట్స్‌ను ఉంచి ఆపరేషన్‌ చేసినప్పటికీ, ఇంకా చాలా గాయాలు ఉన్నప్పటికీ అమ్మ అంత దూరం సైక్లింగ్‌ చేసిందని ఉపాసన చెప్పుకొచ్చింది. ఇది ఎవరికో మెసేజ్ ఇవ్వడం లేదా, ఏదైనా సేవా కార్యక్రమం కోసం కాకుండా, తనను తాను ఛాలెంజ్‌ చేసుకుని ఈ అరుదైన ఫీట్‌ను అమ్మ సాధించింది అంటూ మై రాక్ స్టార్‌ అంటూ ఉపాసన సోషల్‌ మీడియాలో ఈ పోటోను షేర్‌ చేసింది. ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ద ఉన్న వారు, ఆరోగ్యం సరిగ్గా ఉన్న వారు మాత్రమే ఈ సాహసం చేయగలరు. ఎన్నో తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఆమె సైక్లింగ్‌ చేయడం ద్వారా అన్ని సమస్యలు దూరం అవుతాయని ఈ పని చేసి ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వ్యాపారాలు, ఇతర కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగా ఉండటం కాకుండా ఇలా అప్పుడప్పుడు ఆరోగ్యం కోసం అరుదైన ఫీట్లు చేయాల్సిన అవసరం ఉందని శోభన కామినేని గారిని చూస్తే అర్థం అవుతుంది. ఉపాసన కూడా ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె వర్కౌట్స్ మొదలుకుని చాలా విషయాల్లో హీరోయిన్స్‌ను, ప్రముఖ వైద్య నిపుణులను ఫాలో అవుతూ ఉంటుంది. సొంతంగా తనకు హెల్త్‌కు సంబంధించిన సంస్థలు ఉండటంతో పాటు, అనేక విషయాల్లో తన వారి నుంచి ప్రోత్సాహం ఉండటంతో ఉపాసన తెలుగు రాష్ట్రాల్లోనే టాప్‌ లేడీ వ్యాపారవేత్తల జాబితాలో ముందు ఉంది. రామ్‌ చరణ్ భార్యగా, క్లింకార తల్లిగా ఆ బాధ్యతలను కూడా ఉపాసన నిర్వర్తిస్తూ వస్తున్నారు.