బర్త్ డే స్పెషల్: త్రివిక్రమ్ మొదటి సంపాదన ఎంతంటే?
మొదట రచయితగా తన కెరియర్ ను మొదలుపెట్టిన ఈయన ఆ తర్వాత మాటల రచయితగా కూడా పేరు దక్కించుకున్నారు.
By: Madhu Reddy | 7 Nov 2025 10:36 AM ISTఅణుశాస్త్రంలో ఎమ్మెస్సీ పూర్తి చేసి.. గోల్డ్ మెడల్ అందుకున్న ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.. మ్యాథ్స్ లెక్చరర్ గా కొంతకాలం పనిచేశారు. అయితే సాహిత్యం పైన ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి రావాలనుకున్న ఇయాన్ మొదట హైదరాబాదుకి వచ్చి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలా ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ప్రముఖ కమెడియన్ సునీల్ తో కలిసి రూమ్ షేర్ చేసుకున్న త్రివిక్రమ్.. పోసాని కృష్ణ మురళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి దర్శకత్వంలో మెలుకువలు నేర్చుకున్నారు.
మొదట రచయితగా తన కెరియర్ ను మొదలుపెట్టిన ఈయన ఆ తర్వాత మాటల రచయితగా కూడా పేరు దక్కించుకున్నారు. నువ్వే నువ్వే అనే చిత్రంతో దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన త్రివిక్రమ్.. రెండవ సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా మహేష్ బాబుతో అతడు సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. తర్వాత పలు చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించిన ఈయన.. ఇటీవల పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో కూడా స్పెషల్ థాంక్స్ కార్డ్స్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే సుజిత్ దర్శకత్వం వహించిన ఓజి సినిమా విషయంలో త్రివిక్రమ్ జోక్యం చేసుకోకపోవడంతో అసలేం జరిగింది అని అభిమానులు కూడా ఆరా తీసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో కలిసి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు త్రివిక్రమ్. ఇదిలా ఉండగా ఈరోజు ఆయన పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. అందులో భాగంగానే ఆయన మొదటి రెమ్యూనరేషన్ ఎంత అంటూ అటు అభిమానులు కూడా తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే.. అవకాశాల కోసం వెతుకుతున్న సమయంలో త్రివిక్రమ్ ను సునీల్ గౌతమ్ రాజుకి పిల్లల ట్యూషన్ మాస్టర్ గా పరిచయం చేశారట. అయితే గౌతమ్ రాజు ఒకసారి డైరెక్టర్ విజయభాస్కర్ కు పరిచయం చేయడంతోనే ఈయన దశ మారిపోయింది. అలా మొదట కొన్ని సినిమాలకు పేరు లేకుండా కూడా పనిచేయాల్సి వచ్చింది. ఇక ఒక హిట్ సినిమాకి త్రివిక్రమ్ క్లైమాక్స్ డైలాగ్స్ రాయడంతో అప్పట్లో ఈయన కారణంగానే సినిమా హిట్ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి.
ఇకపోతే ఆ సినిమా కోసమే త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటిసారి 2000 మాత్రమే పారితోషకంగా తీసుకున్నారట.. అప్పటినుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ కోసం చాలామంది దర్శకులు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే డైరెక్టర్ భాస్కర్ మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ ను బయటకు వదలకుండా తనతో ఎక్కువగా ట్రావెల్ చేసేలా డీల్ సెట్ చేసుకుంటూ వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 20 నుండి 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు త్రివిక్రమ్.
