Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : ఇరవై ఏళ్లు దాటినా ఈ జోడీలో అదే జోరు

నందమూరి బాలకృష్ణ యొక్క అన్‌ స్టాపబుల్‌ తాజా సీజన్ నుంచి కొత్త ఎపిసోడ్‌ కి రంగం సిద్ధం అయింది

By:  Tupaki Desk   |   14 Dec 2023 6:06 AM GMT
పిక్ టాక్‌ : ఇరవై ఏళ్లు దాటినా ఈ జోడీలో అదే జోరు
X

నందమూరి బాలకృష్ణ యొక్క అన్‌ స్టాపబుల్‌ తాజా సీజన్ నుంచి కొత్త ఎపిసోడ్‌ కి రంగం సిద్ధం అయింది. ఈసారి సీనియర్‌ హీరోయిన్స్ తో పాటు ప్రముఖ దర్శకులు బాలయ్య తో సందడి చేశారు. బాలకృష్ణ తో 20 ఏళ్ల క్రితం చెన్నకేశవ రెడ్డి సినిమాలో నటించి సూపర్‌ హిట్‌ దక్కించుకున్న శ్రియా శరన్‌ ఈ షో లో పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది.


సీనియర్ స్టార్‌ హీరోలందరితో పాటు, మహేష్‌ బాబు, పవన్‌, ఎన్టీఆర్‌, ప్రభాస్ ఇలా యంగ్ స్టార్‌ హీరోల్లో దాదాపు అందరితో కూడా కలిసి నటించిన ఘన చరిత్ర శ్రియా కి ఉంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి 22 ఏళ్లు దాటినా కూడా శ్రియా జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమాలు కాస్త తక్కువ అయినా కూడా సోషల్‌ మీడియాలో అందాల ఫోటో షూట్స్ తో ఎంటర్‌టైన్ చేస్తోంది.

తాజాగా అన్‌ స్టాపబుల్‌ లో బాలయ్యతో ఆమె కనిపిచి మరోసారి అభిమానులకు కన్నుల విందు చేసింది అనడంలో సందేహం లేదు. చెన్నకేశవ రెడ్డి సినిమాలో ఎలాగ అయితే కనిపించారో అలాగే ఈ షో సందర్భంగా కూడా అలాగే కనిపిస్తున్నారు అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ఫోటో ను చూస్తూ ఉంటే బాలయ్య మరియు శ్రియ మరోసారి కలిసి నటిస్తే చూడాలని ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్‌ లో బాలయ్య ఆ విషయమై ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి. బాలకృష్ణ మరియు శ్రియా లు కలిసి చేసిన డాన్స్ ఎపిసోడ్‌ కి ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.

శ్రియా తో పాటు బాలయ్య అన్‌ స్టాపబుల్‌ ఎపిసోడ్‌ లో సుహాసిని, దర్శకులు హరీష్ శంకర్‌ మరియు జయంత్‌ సి పరాన్జీ లు పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్‌ ను వచ్చే వారంలో స్ట్రీమింగ్‌ చేసే అవకాశాలు ఉన్నాయని ఆహా వారి ద్వారా సమాచారం అందుతోంది. బాలయ్య అన్‌స్టాపబుల్‌ లిమిటెడ్‌ ఎడిషన్ సీజన్ లో ఇంతకు ముందు యానిమల్‌ టీమ్‌ సందడి చేసిన విషయం తెల్సిందే.