Begin typing your search above and press return to search.

అన్ స్టాప‌బుల్ షోలో గుంటురు ఘాటు!

న‌ట‌సింహ బాల‌కృష్ణ హోస్ట్ గా నిర్వ‌హిస్తోన్న `అన్ స్టాప‌బుల్` టాక్ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు

By:  Tupaki Desk   |   12 Dec 2023 11:20 AM GMT
అన్ స్టాప‌బుల్ షోలో గుంటురు ఘాటు!
X

న‌ట‌సింహ బాల‌కృష్ణ హోస్ట్ గా నిర్వ‌హిస్తోన్న 'అన్ స్టాప‌బుల్' టాక్ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న టాక్ షోకి ఎలాంటి సెల‌బ్రిటి గెస్ట్ గా వెళ్లినా ఎపిసోడ్ హిట్ అన్న‌ట్లే క‌నిపి స్తోంది. అందులోనూ స్టార్ హీరోలు వెళ్తే ఎపిసోడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంది. ఇప్ప‌టికే చాలా మంది స్టార్ హీరోలు బాల‌య్య తో ముచ్చ‌టించారు. అన్ని ర‌కాల విష‌యాల‌పై బాల‌య్య చ‌ర్చించే విధానం ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకోవ‌డమే టాక్ షో స‌క్సెస్ సీక్రెట్ గా చెప్పొచ్చు.

నిజానికి ఈ టాక్ షో ఇంత పెద్ద హిట్ అవుతుంద‌ని నిర్వాహ‌కులు కూడా గెస్ చేసి ఉండ‌రు. ఎన్నో టాక్ షోలో వ‌చ్చాయి. కానీ ఏది అన్ స్టాప‌బుల్ రేంజ్ లో స‌క్సెస్ అయింది లేదు. బాల‌య్య కంటే ముందు ప‌లువురు హీరోలు టాక్ షోలు చేసారు. కానీ అన్ స్టాప‌బుల్ పేలిన‌ట్లే గా ఇంకేది పేల‌లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రోసారి సూప‌ర్ స్టార్ మ‌హేష్..మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ టాక్ షోకి గెస్ట్ లుగా హాజ‌ర‌వు తున్న‌ట్లు స‌మాచారం.

ప్ర‌స్తుతం వీళ్లిద్ద‌రి కాంబినేష‌న్ లో 'గుంటూరు కారం' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారం ప‌నులు మొద‌ల‌య్యాయి. సంక్రాంతి కానుక‌గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో హీరో కం డైరెక్ట‌ర్ ని గెస్ట్ లుగా ఆహ్వానిం చిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. అదే నిజ‌మైతే తిరుగుండ‌దు. ఆ కాంబినేష‌న్ లో మ‌రో టాక్ షో చూడటానికి ప్రేక్ష‌కులు సిద్దంగా ఉన్నారు.

ఇప్ప‌టికే మ‌హేష్ సోలోగా ఈ టాక్ ఫోకి హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. బాల‌య్య‌-మ‌హేష్ మ‌ధ్య ముచ్చ‌ట్లు అప్ప‌ట్లో అభిమానుల్ని ఎంత‌గానో అల‌రించాయి. బాల‌య్య చ‌మ‌త్కారం..మ‌హేష్ స‌మాధానాలు..పంచ్ లతో షో మంచి హిట్ అయింది. అందులో మ‌హేష్ సినిమా విశేషాల‌తో పాటు ఎన్నో వ్య‌క్తిగత విష‌యాలు బాల‌య్య తో పంచుకున్నారు.