Begin typing your search above and press return to search.

అన్ స్థాపబుల్.. యానిమాల్ వైల్డ్ ఫన్

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఉన్న అన్ స్థాపబుల్ కు ఏ స్థాయిలో క్రేజ్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు

By:  Tupaki Desk   |   18 Nov 2023 7:51 AM GMT
అన్ స్థాపబుల్.. యానిమాల్ వైల్డ్ ఫన్
X

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఉన్న అన్ స్థాపబుల్ కు ఏ స్థాయిలో క్రేజ్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మొదటిసారి ఈ షో కి బాలీవుడ్ హీరో వస్తూ ఉండడం విశేషం. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యానిమల్ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు కేవలం బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా గ్రాండ్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఏకంగా నందమూరి బాలకృష్ణతో రణబీర్ కపూర్ సందడి ఉండడం విశేషం. ఇక ఈ షో ఎలా ఉండబోతుందా అని ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురుచూస్తున్నారు. త్వరలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ఒక ప్రోమో కూడా విడుదల చేశారు. వైల్డ్ ఎపిసోడ్ అంటూ ప్రోమో తోనే మాంచి కిక్ ఇచ్చారు.

ఇక సందీప్ రెడ్డి వంగా విస్కీ పుచ్చుకుంటాను అని చెప్పడంతో త్వరగా నువ్వు నా బ్రాండ్ కు వచ్చేయి స్క్రిప్ట్ త్వరగా రాస్తావు అని బాలకృష్ణ పంచ్ వేసిన విధానం హైలెట్ అయ్యింది. ఇక రణబీర్ కపూర్ ఎంట్రీకి బాలయ్య బాబు స్ట్రాంగ్ ఎలివేషన్ ఇచ్చిన తీరు విజిల్ వెయిస్తోంది. ఇక రణబీర్ బాలయ్య బాబు డైలాగ్స్ తో కిక్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఫ్లూటు జింక ముందు ఉదు.. సింహం ముందు కాదు.. అనే డైలాగ్ రణబీర్ చెప్పాడు. ఇక రష్మిక మందన్నను లవ్లీ గా ఇన్వైట్ చేసిన బాలయ్య నా గుండె మెలికలు తిరిగిపోతోంది అంటూ స్వీట్ గా బాణాలు వదిలారు. ఇక రష్మీకకు అర్జున్ రెడ్డి యానిమాల్ పోస్టర్స్ చూపించి ఎవరు బెస్ట్ హీరోనో ఆమెను అడగాలని రణబీర్ బాలయ్యకు సూచించి ఎవరు బెస్ట్ అని అడగమని చెప్పారు.

అంతే కాకుండా విజయ్ కు ఫోన్ చేయించాగా ముసిముసి నవ్వులు పూయించారు. రష్మిక విజయ్ మధ్యలో ఉన్న గాసిప్ ను మరింత హైలెట్ చేశారు. ఇక బాలయ్య రణబీర్ పైసా వసూల్ పాటకు స్టెప్పులు కూడా వేశారు. అలాగే ట్రబుల్ డైలాగ్ కూడా రణబీర్ చెప్పడం హైలెట్ అయ్యింది. మొత్తానికి ప్రోమో తోనే వైల్డ్ ఫన్ ఇచ్చారు. ఇక ఫుల్ ఎపిసోడ్ నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది.