Begin typing your search above and press return to search.

బాలయ్య అన్ స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్.. అల్లరే అల్లరి..!

బాలకృష్ణ లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆ చిత్ర యూనిట్ తో బాలయ్య సరదా సంభాషణలు జరిపారు

By:  Tupaki Desk   |   18 Oct 2023 8:01 AM GMT
బాలయ్య అన్ స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్.. అల్లరే అల్లరి..!
X

అన్ స్టాపబుల్ షోతో బాలకృష్ణ స్పెషల్ క్రేజ్ ఏర్పరచుకున్నారు. ఈ షో ముందు బాలకృష్ణ మీద ఒక ఒపీనియన్ ఉండగా అన్ స్టాపబుల్ తర్వాత బాలయ్య ఇలా ఉంటాడా అని అందరికీ తెలిసింది. ఈ క్రమంలో అన్ స్టాపబుల్ షో ఓటీటీలో ది బెస్ట్ చాట్ షోగా మారింది. రెండు సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో సీజన్ 3 కోసం ఆడియన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్య అన్ స్టాపబుల్ స్పెషల్ ఎడిషన్ ఒకటి రిలీజైంది.

బాలకృష్ణ లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆ చిత్ర యూనిట్ తో బాలయ్య సరదా సంభాషణలు జరిపారు. అన్ స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ అంటూ స్పెషల్ ఎపిసోడ్ లేటెస్ట్ గా ఆహా లో టెలికాస్ట్ అయింది. అన్ స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ మొదటి ఎపిసోడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షోలో భాగంగా బాలయ్య తన పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టారు. చీకట్లు చిమ్మినా మళ్లీ చంద్రుడు ఉదయిస్తూనే ఉంటాడు అంటూ షోని మొదలు పెట్టిన బాలయ్య మా మాట మీకు సుపరిచితం, మా బాట సుపరిచితం, మేమేంటో మా వీళ్లేంటో మా వెంట ఉండే మీకు సదా నమ్మకం రోజులు మారినా రుతువులు రంగులు మార్చినా ఎన్ని అమావాస్యలు చీకట్లు చిమ్మినా చద్రుడు ఉదయిస్తూనే ఉంటాడు అంటూ డైలాగ్ తో అదరగొట్టారు బాలకృష్ణ.

షోలో భాగంగా కాజల్, శ్రీ లీలలను కొన్ని ప్రశ్నలన్ అడిగారు బాలయ్య. రాగానే జెండా పాతేశావ్ ఈ అమ్మాయి అల్లరి పిల్ల, తెలివైన పిల్ల ఇప్పుడప్పుడే వెళ్లే పిల్ల కాదు కాజల్ ఎన్నేళ్లు ఉంటుందో అన్నేళ్లు ఉంటుందని అన్నారు. తాను లేని టైం లో అనీల్ శ్రీలీల కాజల్ తో రీల్స్ చేయడం నచ్చలేదని అన్నారు. మీ అబ్బాయి పాలు తాగకపోయినా, నీళ్లు తాగకపోయినా నా ఫోటో చూపించి ఉంటావ గబ్బర్ వస్తాడు అంటే ఇప్పటివరకు ట్రై చేయలేదు ఈసారి ట్రై చేస్తానని అన్నారు కాజల్. టాలీవుడ్ లో అందరితో సినిమాలు చేశావ్ మోక్షజ్ఞతో చేస్తావా అంటే చేస్తానని అన్నారు కాజల్.

ఈ చిట్ చాట్ లో భాగంగా భగవంత్ కేసరి మేకింగ్ వీడియో చూపించగా అదంతా మార్ఫింగ్ వీడియో అని తాను కాజల్ చాలా డిసిప్లేన్ గా ఉన్నామని అనీల్, శ్రీ లీల అల్లరి వారని అన్నారు బాలకృష్ణ. సెట్ లో గలగలా మాట్లాడతావు మరి ఇక్కడ ఎందుకు బుద్దిమంతురాలు అన్నట్టు కూర్చున్నావు అని అడిగితే మీరు కాజల్ ని అడుగుతున్నారని సైలెంట్ గా ఉన్నా అని శ్రీ లీల చెప్పింది. మీతో సినిమా అంటే భయాలు ఉండేవి కానీ మిమ్మల్ని కలిశాక ఆ భయాలు పోయాయని శ్రీ లీల చెప్పింది. ఇప్పుడే ఇలాంటి కథలు చేయొచ్చా అని ఆలోచన వచ్చినా స్క్రిప్ట్ నచ్చి చేసేశా అందుకే బెస్ట్ డెసిషన్ తీసుకున్నా అని అన్నది శ్రీ లీల.

ఏడు సినిమాలు తీసిన నేను సాధారణ దర్శకుడిని మీరు సెట్ లోకి రాగానే గురువుగారు అని పిలిచారు ఎందుకని అడిగితే నువ్వు బచ్చా అయితే నేను బాలుడిని నీ కంటే తక్కువే అని అన్నారు బాలకృష్ణ. ఏ డైరెక్టర్ అయినా నాకు మా నాన్న గారితో సమానం. ఎందుకంటే దర్శకుడు నా పాత్రకు ప్రాణం పోస్తాడు కాబట్టి వారు నాకు గురువులాంటి వారని అన్నారు బాలకృష్ణ. నువ్వు రాగానే అడిగావు కాబట్టి నా ఈగో హర్ట్ అయ్యిందని బాలయ్య కాస్త అలిగారు. ఆ తర్వాత మళ్లీ తన సరదా సంభాషణలతో ఇంటర్వ్యూ కొనసాగించారు. మొత్తానికి భగవంత్ కేసరి స్పెషల్ ఎపిసోడ్ అన్ స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ లో ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్టైన్ అందించిందని చెప్పొచ్చు.