Begin typing your search above and press return to search.

అన్ స్టాపబుల్ సీజన్ 3 షురూ… ఫస్ట్ ఎపిసోడ్లో వారే

ఇప్పుడు సీజన్ 3 కి రంగం సిద్ధం అవుతోంది. తాజాగా మూడో సీజన్ లో భాగంగా మొదటి ఎపిసోడ్ ని షూట్ చేశారు.

By:  Tupaki Desk   |   12 Oct 2023 4:51 AM GMT
అన్ స్టాపబుల్ సీజన్ 3 షురూ… ఫస్ట్ ఎపిసోడ్లో వారే
X

ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తోన్న టాక్ షో అన్ స్టాపబుల్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ షో ఇప్పటికే రెండు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. రెండో సీజన్ లో ఆసక్తికరంగా సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా రాజకీయ ప్రముఖులు అయిన చంద్రబాబు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి లాంటి మాజీ సిఎంలు వచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి స్టార్స్ పార్టిసిపేట్ చేశారు.

దీంతో సీజన్ 2 బిగ్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు సీజన్ 3 కి రంగం సిద్ధం అవుతోంది. తాజాగా మూడో సీజన్ లో భాగంగా మొదటి ఎపిసోడ్ ని షూట్ చేశారు. భగవంత్ కేసరి టీమ్ తో అన్ స్టాపబుల్ సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్ ఉండబోతోంది. మరి తన మూవీ టీమ్ సభ్యులని హోస్ట్ సీట్ లో కూర్చొని బాలయ్య ఎలాంటి ప్రశ్నలు వేయబోతున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సీజన్ 3 ఎపిసోడ్ 1 షూటింగ్ కంప్లీట్ అయిన విషయాన్ని ఆహా టీమ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇందులో కాజల్ అగర్వాల్, అనిల్ రావిపూడి, శ్రీలీలతో పాటు విలన్ రోల్ చేసిన అర్జున్ రాంపాల్ కూడా ఉన్నారు. వీరందరితో బాలయ్య ముచ్చట్లు, సినిమా విశేషాలు చర్చించారు. ఇక సీజన్ 3ని తక్కువ ఎపిసోడ్స్ తోనే ఫినిష్ చేయనున్నారంట.

ఇందులో మెగాస్టార్ చిరంజీవితో ఒక ఎపిసోడ్ ఉంటుందంట. ఇది సీజన్ కి ఫైనల్ ఎపిసోడ్ అనే మాట వినిపిస్తోంది. చాలా కాలంగా బాలయ్య, చిరంజీవి మధ్య కొంత గ్యాప్ నడుస్తోంది. ఈ గ్యాప్ ఈ సారి టాక్ షోతో పూర్తిగా దూరం అయిపోతుందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. అలాగే రామ్ చరణ్ కూడా ఒక ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్.

మొదటి, రెండు సీజన్స్ తరహాలోనే అన్ స్టాపబుల్ సీజన్ 3 కూడా మంచి సక్సెస్ అంవుతుందా లేదంటే ఏవరేజ్ గా నిలుస్తుందా అనేది తెలియాల్సి ఉంది. బాలయ్య హోస్టింగ్ ని ఎంజాయ్ చేసేవారికి ప్రతి సీజన్ కచ్చితంగా నచ్చుతుందని చెప్పొచ్చు. అయితే వచ్చే గెస్ట్స్ బట్టి సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది.