Begin typing your search above and press return to search.

లిమిటెడ్ గానే అన్ స్టాపబుల్ సీజన్ 3

బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో ప్రసారం అయ్యే అన్ స్టాపబుల్ టాక్ షో ఇప్పటికే రెండు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది.

By:  Tupaki Desk   |   8 Oct 2023 4:04 AM GMT
లిమిటెడ్ గానే అన్ స్టాపబుల్ సీజన్ 3
X

బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో ప్రసారం అయ్యే అన్ స్టాపబుల్ టాక్ షో ఇప్పటికే రెండు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. ఈ రెండు సూపర్ సక్సెస్ అయ్యాయి. స్టార్ సెలబ్రిటీలు ఈ టాక్ షోలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్, ప్రభాస్, చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి సినిమా, రాజకీయ ప్రముఖులు బాలయ్యతో టాక్ షోలో పాల్గొని ఎంటర్టైన్ చేశారు. ఈ షోలకి మంచి వ్యూయర్ షిప్ కూడా వచ్చింది.

పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి హైయెస్ట్ వ్యూయర్ షిప్ వచ్చినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా బాలయ్య సీజన్ 3కి సైన్ చేసిన సంగతి తెలిసిందే. దసరా నుంచి సీజన్ 3 టెలికాస్ట్ చేయాలని అనుకుంటున్నారంట. ఫస్ట్ ఎపిసోడ్ గా బాలయ్య భగవంత్ కేసరి మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరోయిన్ శ్రీలీలతో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

అలాగే సీజన్ 3ని లిమిటెడ్ ఎపిసోడ్స్ తోనే పూర్తి చేయాలని అనుకుంటున్నారంట. ఎన్నికల వేడి ఉండటం, అలాగే చంద్రబాబు జైలులో ఉండటం వలన బాలయ్య రాజకీయాలలో బిజీగా ఉన్నారు. ఈ కారణంగా సీజన్ 3 ని కుదించినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఈ సీజన్ లో టాక్ షోలో పాల్గొనడం దాదాపు ఖాయం అయిపోయిందంట. అతనితో ఫైనల్ ఎపిసోడ్ ని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

అది కూడా మెగా ఎపిసోడ్ గా డిజైన్ చేసే ఆలోచనలో ఉన్నారంట. ఈ సీజన్ లో కూడా సినీ, రాజకీయ ప్రముఖులు సమ్మేళనంతో షో నిర్వహించాలని ఆహా యాజమాన్యం భావిస్తుందని టాక్. మరి ఈ సీజన్ 3 ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే సీజన్ 1, 2 కి వచ్చినంత సక్సెస్ సీజన్ 3 కి కూడా లభిస్తుందా లేదా అనేది కూడా ఇంటరెస్టింగ్ విషయంగా మారింది.

బాలయ్య నటించిన భగవంత్ కేసరి అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపైన అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అనిల్ రావిపూడి లాంటి మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నుంచి రాబోతున్న సినిమా కావడం, అది కూడా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుండటం సినిమాపై హైప్ పెరగడానికి కారణం అని చెప్పాలి.