Begin typing your search above and press return to search.

అన్ స్టాపబుల్ సీజన్ 3కి రంగం సిద్ధం

ఈ సారి అంతకు మించి ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవితో ఒక ఎపిసోడ్ చేయాలని చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   6 Oct 2023 4:04 AM GMT
అన్ స్టాపబుల్ సీజన్ 3కి రంగం సిద్ధం
X

ఆహాలో బాలకృష్ణ చేస్తోన్న అన్ స్టాపబుల్ టాక్ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇప్పటికే రెండు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న అన్ స్టాపబుల్ సూపర్ సక్సెస్ అందుకొని మూడో సీజన్ లోకి అడుగుపెడుతోంది. మొదటి సీజన్ కంటే రెండో సీజన్ సూపర్ హిట్ అయ్యింది. అందులో పవన్ కళ్యాణ్, ప్రభాస్, చంద్రబాబు లాంటి సినీ, పొలిటికల్ స్టార్స్ వచ్చారు.

ఈ సారి అంతకు మించి ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవితో ఒక ఎపిసోడ్ చేయాలని చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు వర్క్ అవుట్ అయినట్లు సమాచారం. అయితే దానికి సంబందించిన ఎపిసోడ్ ఎప్పుడు ఉంటుందనేది క్లారిటీ లేదు. ఇక సీజన్ 3 దసరా నుంచి టెలికాస్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారంట.

దసరా ఫెస్టివల్ సీజన్ కావడంతో మంచి ఓపెనింగ్ అవుతుందని అనుకుంటున్నారు. ఈ ఫస్ట్ ఎపిసోడ్ అనిల్ రావిపూడి, శ్రీలీలతో ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. భగవంత్ కేసరి మూవీ ప్రమోషన్ లో భాగంగా మొదటి ఎపిసోడ్ ఈ సారి సింపుల్ గానే ప్లాన్ చేస్తున్నారంట. తరువాత మాత్రం ప్రతి ఎపిసోడ్ కి ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా ఇప్పటి వరకు టాక్ షోలలో పార్టిసిపేట్ చేయని వారిని తీసుకొచ్చే పనిలో ఉన్నారంట.

మెగాస్టార్ రావడం ఇంచుమించు ఖాయం అయినట్లు సమాచారం. ఇంకా ఎవరెవరు వస్తారనేది వేచి చూడాలి. బాలకృష్ణ ఓ వైపు ఏపీ రాజకీయాలలో చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో కాస్తా సీరియస్ పోలిటిక్స్ చేస్తున్నారు. ఈ సమయంలో కూడా అన్ స్టాపబుల్ సీజన్ 3కి ఒకే చెప్పడం విశేషం. అయితే జూనియర్ ఎన్టీఅర్ తోఒక ఎపిసోడ్ ప్లాన్ చేయాలని అనుకున్నారు.

ఇప్పుడున్న పరిస్థితిలో ఇక అది సాధ్యం కాకపోవచ్చు. బాలయ్య కూడా జూనియర్ తో టాక్ షోలో హోస్ట్ గా చేయడానికి ఆసక్తి చూపించకపోవచ్చనే మాట వినిపిస్తోంది. అలాగే తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్స్ ఈ సారి షోలో పాల్గొనే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు.